Galaxy M31s First Sale: అద్బుతమైన ఆఫర్లు!! కొనుగోలుకు సరైన సమయం...

|

ఇండియాలో గత వారం ఆన్‌లైన్ ద్వారా శామ్సంగ్ సంస్థ M సిరీస్ విభాగంలో గ్యాలక్సీM31s అనే మరోక కొత్త మోడల్‌ను విడుదల చేసింది. మెరుగైన కెమెరా సెటప్, ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లే మరియు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ వంటి అద్భుతమైన స్పెసిఫికేషన్స్ గల గెలాక్సీ M31s స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు అమెజాన్ ఇండియా మరియు శామ్‌సంగ్ యొక్క ఆన్‌లైన్ స్టోర్‌లో మొదటిసారి జరగనున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ M31s ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ M31s ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ M31s స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఇండియాలో  రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ రూ.19,499 ధర వద్ద మరియు 8GB ర్యామ్ + 128GB మోడల్ రూ. 21,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మిరాజ్ బ్లాక్ మరియు మిరాజ్ బ్లూ కలర్ ఎంపికలలో లభిస్తుంది. వీటిని శామ్సంగ్ షాప్ మరియు అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయవచ్చు.

శామ్‌సంగ్ గెలాక్సీ M31s  HD + సూపర్ AMOLED డిస్ప్లే స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ M31s  HD + సూపర్ AMOLED డిస్ప్లే స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ M31s స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 ను వన్ యుఐ మరియు ఎక్సినోస్ 9611 SoC చేత రన్ అవుతూ 6GB మరియు 8GB RAM తో జతచేయబడి వస్తుంది. అలాగే ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ 6.5-అంగుళాల ఫుల్ HD + సూపర్ AMOLED డిస్ప్లేను గరిష్టంగా 420 నిట్స్ ప్రకాశంతో కలిగి ఉంటుంది. డిజైన్ విషయానికి వస్తే ఇది నిగనిగలాడే ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు హోల్-పంచ్ డిస్ప్లేను కలిగి ఉంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M3s క్వాడ్ రియర్ కెమెరా సెటప్

శామ్‌సంగ్ గెలాక్సీ M3s క్వాడ్ రియర్ కెమెరా సెటప్

శామ్‌సంగ్ గెలాక్సీ M31s యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం గెలాక్సీ M31s యొక్క వెనుకభాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 64 / మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సోనీ IMX682 సెన్సార్‌ మరియు f / 1.8 లెన్స్‌ను కలిగి ఉంది. అలాగే f / 2.4 ఎపర్చుర్ తో 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా 123-డిగ్రీల అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ను కలిగి ఉంది . అలాగే కెమెరా సెటప్‌లో 5 మెగాపిక్సెల్ డెప్త్ షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు జతచేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం గెలాక్సీ M31s ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది 4K వీడియో రికార్డింగ్ మరియు స్లో-మోషన్ వీడియోలు, AR డూడుల్ మరియు AR ఎమోజి వంటి ఫీచర్ల మద్దతుతో వస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M3s 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

శామ్‌సంగ్ గెలాక్సీ M3s 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

శామ్‌సంగ్ గెలాక్సీ M3s ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని మరింత  విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS / A-GPS, USB టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇది 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 25W ఛార్జర్ ద్వారా వేగంగా ఛార్జింగ్ చేయడానికి మద్దతు ఇస్తుంది. 

Best Mobiles in India

Read more about:
English summary
Samsung Galaxy M31s First Sale Start Today via Amazon and Samsung Website

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X