Home
News

Samsung M31s వచ్చేసింది!! 6000mAh బ్యాటరీ,64MP కెమెరా ఫీచర్లతో...

శామ్‌సంగ్ గెలాక్సీ కంపెనీ ఇండియాలో మరొక స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. గెలాక్సీ Mసిరీస్‌లో సరికొత్త మోడల్‌గా శామ్‌సంగ్ గెలాక్సీ M31s ను ఈ రోజు ఇండియాలో విడుదల చేశారు. ఫిబ్రవరిలో లాంచ్ అయిన గెలాక్సీ M31 కి అప్‌గ్రేడ్ గా ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ హోల్-పంచ్ డిస్ప్లే మరియు క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M31s ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ M31s ధరల వివరాలు

ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ M31s ను రెండు వేరియంట్లలో విడుదల చేసారు. ఇందులో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.19,499 కాగా 8GB ర్యామ్ + 128GB ఆప్షన్ ధర రూ. 21,499. ఈ ఫోన్ మిరాజ్ బ్లాక్ మరియు మిరాజ్ బ్లూ కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క మొదటి అమ్మకాలు అమెజాన్ ప్రైమ్ డే రోజున ఆగస్టు 6 న మొదలుకానున్నాయి. కొనుగోలుదారులు దీనిని శామ్సంగ్ షాప్ మరియు అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయవచ్చు.

 

శామ్‌సంగ్ గెలాక్సీ M31s స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ M31s స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ M31s స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 ను వన్ యుఐ మరియు ఎక్సినోస్ 9611 SoC చేత రన్ అవుతూ 6GB మరియు 8GB RAM తో జతచేయబడి వస్తుంది. అలాగే ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ 6.5-అంగుళాల ఫుల్ HD + సూపర్ AMOLED డిస్ప్లేను గరిష్టంగా 420 నిట్స్ ప్రకాశంతో కలిగి ఉంటుంది. డిజైన్ విషయానికి వస్తే ఇది నిగనిగలాడే ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు హోల్-పంచ్ డిస్ప్లేను కలిగి ఉంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M3s 64MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్

శామ్‌సంగ్ గెలాక్సీ M3s 64MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్

శామ్‌సంగ్ గెలాక్సీ M31s యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం గెలాక్సీ M31s యొక్క వెనుకభాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 64 / మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సోనీ IMX682 సెన్సార్‌ మరియు f / 1.8 లెన్స్‌ను కలిగి ఉంది. అలాగే f / 2.4 ఎపర్చుర్ తో 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా 123-డిగ్రీల అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ను కలిగి ఉంది . అలాగే కెమెరా సెటప్‌లో 5 మెగాపిక్సెల్ డెప్త్ షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు జతచేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం గెలాక్సీ M31s ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది 4K వీడియో రికార్డింగ్ మరియు స్లో-మోషన్ వీడియోలు, AR డూడుల్ మరియు AR ఎమోజి వంటి ఫీచర్ల మద్దతుతో వస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M3s 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

శామ్‌సంగ్ గెలాక్సీ M3s 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

శామ్‌సంగ్ గెలాక్సీ M3s ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని మరింత విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS / A-GPS, USB టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇది 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 25W ఛార్జర్ ద్వారా వేగంగా ఛార్జింగ్ చేయడానికి మద్దతు ఇస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy M31s Released with 6000mAh Batter Capacity in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X