శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G మొదటి సేల్ డిస్కౌంట్ ఆఫర్లతో ప్రారంభం అయ్యాయి!!
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ ఇండియాలో అన్ని దరల విభాగాలలో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తోంది. అందులో భాగంగానే ఇటీవల ఈ సంస్థ శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G స్మార్ట్‌ఫోన్ ను మిడ్ రేంజ్ విభాగంలో గత వారం లాంచ్ చేసింది. ఈ ఫోన్ నేడు మొదటిసారి అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. శామ్‌సంగ్ సంస్థ నుండి మిడ్-టైర్ విభాగంలో 5G కనెక్టివిటీతో రెండు కాన్ఫిగరేషన్‌లతో పాటు రెండు కలర్ ఆప్షన్‌లలో అందించబడుతున్న ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ SoC ద్వారా రన్ అవుతూ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G ధరలు & సేల్స్ ఆఫర్స్
శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G స్మార్ట్‌ఫోన్ ఇండియాలో ఇప్పుడు కొనుగోలు చేయడానికి రెండు కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. ఇందులో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.20,999 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.22,999. ఈ ఫోన్ స్లేట్ బ్లాక్ మరియు స్కై బ్లూ కలర్ లలో ఈరోజు నుంచి అమెజాన్ మరియు Samsung.com ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి నో-కాస్ట్ EMI లావాదేవీలతో పాటుగా రూ.2,000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రైమ్ సభ్యులకు తొమ్మిది నెలల వరకు నో-కాస్ట్ EMI కూడా లభిస్తుంది. శామ్‌సంగ్ వెబ్‌సైట్ నో-కాస్ట్ EMI ఎంపికలను కూడా అందిస్తోంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G స్పెసిఫికేషన్‌లు
శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై OneUI 3.1 తో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల HD+ TFT ఇన్ఫినిటీ- V డిస్‌ప్లేను కలిగి ఉండి హుడ్ కింద ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 SoC ని శక్తిని కలిగి ఉండి 8GB RAM మరియు 128GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G స్మార్ట్ ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ప్యాక్ చేస్తుంది. దీనితో పాటు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌తో పాటు అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు ఒక 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ని కలిగి ఉంటుంది.

గెలాక్సీ M32 5G ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 SoC ప్రాసెసర్ ద్వారా రన్ అవుతూ 6GB వరకు RAM మరియు 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ మోనో స్పీకర్‌తో వస్తుంది మరియు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తుంది. ఈ పరికరం Android 11 లో OneUI 3.1 తో నడుస్తుంది. ఈ పరికరం 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ పరంగా గెలాక్సీ M32 5G డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5G, 4G VoLTE, Wi-Fi 802.11 b / g / n / ac, బ్లూటూత్, GPS మరియు USB టైప్-సి పోర్ట్‌కు మద్దతు ఇస్తుంది. గెలాక్సీ M32 5G సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో కూడా వస్తుంది.


Click it and Unblock the Notifications