శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...
కొరియన్ టెక్ దిగ్గజం శామ్‌సంగ్ మిడ్-టైర్ 5G ఆఫర్‌గా శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G స్మార్ట్‌ఫోన్ ను నేడు భారతదేశంలో లాంచ్ చేసారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ SoC ద్వారా శక్తిని పొందుతూ క్వాడ్-రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది ఇతర స్మార్ట్‌ఫోన్‌ల వలె నాచ్డ్ డిస్‌ప్లేని కలిగి ఉండి దిగువన మందపాటి బెజెల్‌ల నిర్మాణంను కలిగి ఉంటుంది. శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G ఫోన్ 12 రకాల బ్యాండ్‌లకు మద్దతును ఇస్తుంది మరియు శామ్‌సంగ్ నాక్స్ సెక్యూరిటీని అంతర్నిర్మితంగా కలిగి ఉంది. రెండు కలర్ ఆప్షన్ మరియు రెండు కాన్ఫిగరేషన్‌లలో అందించబడే ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G ఫోన్ ధరలు & లభ్యత వివరాలు
శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రెండు వేరియంట్ లలో లాంచ్ అయింది. ఇందులో 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.20,999 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ కూడా ఉంది. అయితే దీని యొక్క ధర ఇంకా ప్రకటించలేదు. ఈ ఫోన్ స్లేట్ బ్లాక్ మరియు స్కై బ్లూ కలర్‌లో అందించబడుతుంది. ఇది సెప్టెంబర్ 2 మధ్యాహ్నం 1 గంట నుండి అమెజాన్ ద్వారా విక్రయించబడుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 2,000 తక్షణ తగ్గింపు మరియు నో-కాస్ట్ EMI కూడా లభిస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G స్పెసిఫికేషన్‌లు
శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై OneUI 3.1 తో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల HD+ TFT ఇన్ఫినిటీ- V డిస్‌ప్లేను కలిగి ఉండి హుడ్ కింద ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 SoC ని శక్తిని కలిగి ఉండి 8GB RAM మరియు 128GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G స్మార్ట్ ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ప్యాక్ చేస్తుంది. దీనితో పాటు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌తో పాటు అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు ఒక 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ని కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








