శామ్సంగ్ గెలాక్సీ M32 స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై రూ.2,000 భారీ తగ్గింపు!!

|

శామ్సంగ్ గెలాక్సీ M32 స్మార్ట్‌ఫోన్‌ భారతదేశంలో ఒక సంవత్సరం ముందు లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో 4GB ర్యామ్ +64GB స్టోరేజ్ మరియు 6GB ర్యామ్ +128GB స్టోరేజ్ వంటి రెండు వేరియంట్‌లలో వరుసగా రూ.14,999 మరియు రూ.16,999 ధరల వద్ద లాంచ్ అయింది. ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు శామ్సంగ్ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,000 వరకు తగ్గింపును అందుకున్నది.

 

శామ్సంగ్ గెలాక్సీ M32

ఈ రెండు వేరియంట్ల మీద ధర తగ్గింపును అందుకున్న తరువాత బేస్ వేరియంట్ ఇప్పుడు రూ.12,999 తగ్గింపు ధర వద్ద అందుబాటులో ఉండగా సుపీరియర్ వేరియంట్ ఇప్పుడు రూ.14,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ భారతదేశంలో 12 నెలలకు ముందు మొదటిసారి కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు రూ.2000 ధర తగ్గింపు అందుకోవడం అనేది అర్థమైన విషయమే. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతమేర విలువైనదో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G ధరలు

శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G ధరలు

శామ్‌సంగ్ గెలాక్సీ M32 స్మార్ట్‌ఫోన్ యొక్క 5G వేరియంట్ తరువాత ఇండియాలో రెండు వేరియంట్ లలో లాంచ్ అయింది. ఇందులో 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.20,999 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ స్లేట్ బ్లాక్ మరియు స్కై బ్లూ కలర్‌లో సెప్టెంబర్ నెలలో లాంచ్ అయింది.

శామ్‌సంగ్ గెలాక్సీ M32 స్పెసిఫికేషన్స్
 

శామ్‌సంగ్ గెలాక్సీ M32 స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ M32 స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై OneUI 3.1 తో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల HD+ TFT ఇన్ఫినిటీ- V డిస్‌ప్లేను కలిగి ఉండి హుడ్ కింద ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 SoC ని శక్తిని కలిగి ఉండి 8GB RAM మరియు 128GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది.

ఆప్టిక్స్

శామ్‌సంగ్ గెలాక్సీ M32 స్మార్ట్ ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ప్యాక్ చేస్తుంది. దీనితో పాటు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌తో పాటు అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు ఒక 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ని కలిగి ఉంటుంది.

కనెక్టివిటీ

శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G స్మార్ట్ ఫోన్ యొక్క కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది 4G LTE, Wi-Fi, బ్లూటూత్‌ మద్దతుతో లభిస్తుంది. ఇందులో 3.5mm ఆడియో జాక్‌ను కూడా కలిగి ఉంది. అదనపు భద్రత కోసం డివైస్ పక్కన ఉన్న పవర్ బటన్ పైన ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చబడి ఉంటుంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6000mAh భారీ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. శామ్సంగ్ గెలాక్సీ M32 స్మార్ట్ ఫోన్ యొక్క ధర తగ్గిన తరువాత కొనుగోలు చేయడానికి మంచి ఎంపిక కావచ్చు. డిస్‌ప్లే మరియు బ్యాటరీ స్పెసిఫికేషన్‌లు కూడా బాగున్నాయి. అయితే ఇందులో ఉన్న ఒకే ఒక్క లోపం ఏమిటంటే ఇది 5G స్మార్ట్‌ఫోన్ కాదు.

శామ్సంగ్ 24 నెలల నో కాస్ట్ EMI ఆఫర్‌

శామ్సంగ్ 24 నెలల నో కాస్ట్ EMI ఆఫర్‌

24 నెలల నో కాస్ట్ EMI ఆఫర్‌లో భాగంగా గెలాక్సీ S22+ మరియు గెలాక్సీ S22 స్మార్ట్‌ఫోన్‌లను ఇప్పుడు నెలకు రూ.3042 ధర వద్ద నుండి ప్రారంభమయ్యే EMI చెల్లుబాటుతో పొందవచ్చు. అలాగే గెలాక్సీ S22 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను రూ.4584 నో-కాస్ట్ EMI వద్ద కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. అలాగే వినియోగదారులు శామ్సంగ్ బ్రాండ్ యొక్క ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లపై కూడా 24 నెలల నో కాస్ట్ EMIని కూడా పొందవచ్చు. ముఖ్యంగా శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్3 5G మరియు గెలాక్సీ ఫ్లిప్ 3 5Gలను ఈ ప్రత్యేక ఆఫర్లతో పొందవచ్చు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు శామ్సంగ్ వినియోగదారులు ఇష్టపడే అన్ని రకాల ఫ్లాగ్‌షిప్ ఆవిష్కరణలతో నిర్మించిన ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు.

ISOCELL HP3 సెన్సార్‌

దక్షిణ కొరియా టెక్ కంపెనీ తన న్యూస్‌రూమ్ ద్వారా కొత్త ISOCELL HP3 సెన్సార్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది పరిశ్రమ యొక్క అతి చిన్న 0.56-మైక్రాన్ పిక్సెల్‌లతో కూడిన మొదటి మొబైల్ సెన్సార్‌గా పేర్కొనబడింది. ISOCELL HP3 మునుపటి 0.64-మైక్రాన్ పిక్సెల్‌ల కంటే 12 శాతం చిన్న పిక్సెల్ పరిమాణాన్ని కలిగి ఉందని చెప్పబడింది. ఇది కెమెరా మాడ్యూల్ ఉపరితల వైశాల్యంలో దాదాపు 20 శాతం తగ్గింపుతో 1/1.4 ఆప్టికల్ ఫార్మాట్‌లో 200 మిలియన్ పిక్సెల్‌లను కలిగి ఉంటుంది. దీనితో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ పరికరాలను స్లిమ్‌గా ఉంచడానికి అనుమతిస్తుంది. సూపర్ QPD ఆటో-ఫోకస్ సామర్థ్యాలతో ISOCELL HP3 సెన్సార్ పిక్సెల్‌లు అన్నీ ఆటో-ఫోకసింగ్ సామర్థ్యాలతో అమర్చబడి ఉంటాయి. శామ్సంగ్ ప్రకారం సూపర్ QPD సమాంతర మరియు నిలువు దిశలలో తేడాలను గుర్తించడానికి పిక్సెల్‌లలోని ఒకే లెన్స్‌ను ఉపయోగిస్తుంది. ఇది వినియోగదారులకు మెరుగైన ఆటో ఫోకస్‌ని అందిస్తుంది. ఈ సెన్సార్ తో వినియోగదారులను 30fps వద్ద 8K లేదా 120fps వద్ద 4K వీడియోలను తీయడానికి అనుమతిస్తుంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy M32 Gets Rs. 2,000 Price Cut: Should You Buy?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X