శామ్‌సంగ్ గెలాక్సీ M32 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధర కూడా తక్కువే

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శామ్సంగ్ ఎట్టకేలకు ఇండియాలో తన తదుపరి కొత్త ఫోన్ గెలాక్సీ M32 ను లాంచ్ చేసింది. సంస్థ యొక్క ఈ తాజా స్మార్ట్‌ఫోన్ ఆసక్తికరమైన ఫీచర్లతో లోడ్ చేయబడి అందుబాటులోకి వచ్చింది. ఈ జాబితాలో 6.4-అంగుళాల AMOLED డిస్ప్లే, 6,000mAh భారీ బ్యాటరీ, 64MP క్వాడ్ రియర్ కెమెరా వంటి మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి. హ్యాండ్‌సెట్ ఆసక్తికరమైన డిజైన్ ను కలిగి ఉండి రెడ్‌మి నోట్ 10S, పోకో M3 ప్రో 5G, రియల్‌మి 8 5G వంటి వాటితో పోటీ పడనుంది. భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ M32 ధర, లాంచ్ ఆఫర్స్ మరియు ఫీచర్స్ వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ M32 ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ M32 ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ M32 ఫోన్ ఇండియాలో రెండు వేరియంట్ లలో లాంచ్ అయింది. ఇందులో 4GB ర్యామ్ + 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ.14,999 కాగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఆప్షన్ యొక్క ధర రూ.16,999. ఈ స్మార్ట్‌ఫోన్ ను అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఇది బ్లాక్, వైట్ మరియు బ్లూతో సహా మూడు రంగు ఎంపికలలో వస్తుంది.

Apple iOS ఆపరేటింగ్ సిస్టంలో కొత్త బగ్!! Wi-Fi యాక్సెస్ లో సమస్యలుApple iOS ఆపరేటింగ్ సిస్టంలో కొత్త బగ్!! Wi-Fi యాక్సెస్ లో సమస్యలు

శామ్‌సంగ్ గెలాక్సీ M32 స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ M32 స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ సంస్థ యొక్క సరికొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ M32 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డి + ఇన్ఫినిటీ-యు అమోలెడ్ డిస్‌ప్లేతో 2400 x 1080 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో లోడ్ చేయబడింది. ఈ స్క్రీన్ 90 నిట్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 800 నిట్ బ్రైట్‌నెస్ లను కలిగి ఉండడమే కాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ సపోర్ట్ తో వస్తుంది.

మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్

గెలాక్సీ M32 ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతూ 6GB వరకు RAM మరియు 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఈ హ్యాండ్‌సెట్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. మొదటి కెమెరా 64MP సెన్సార్‌తో వస్తుంది. దీనితో పాటు 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మాక్రో షూటర్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కెమెరాలు జతచేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 20MP లెన్స్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌

ఈ హ్యాండ్‌సెట్ మోనో స్పీకర్‌తో వస్తుంది మరియు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తుంది. ఈ పరికరం Android 11 లో OneUI తో నడుస్తుంది. ఈ పరికరం 6WmAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. అయితే, బ్రాండ్ ప్రస్తుతం బాక్స్‌లో 15W ఛార్జర్‌ను అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా, గెలాక్సీ M32 డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4G VoLTE, Wi-Fi 802.11 b / g / n / ac, బ్లూటూత్, GPS మరియు USB టైప్-సి పోర్ట్‌కు మద్దతు ఇస్తుంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy M32 Released in India With AMOLED Display, 6,000mAh Battery: Price, Specs and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X