Samsung నుంచి మరో కొత్త 5G ఫోన్! లాంచ్ వివరాలు
శాంసంగ్ గెలాక్సీ M34 5G త్వరలోనే భారతదేశంలో లాంచ్ జరగవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్‌ను సూచించే విధంగా ఈ ఫోన్‌కు సపోర్ట్ పేజీ కూడా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. శాంసంగ్ ఇండియా యొక్క సపోర్ట్ పేజీలో గుర్తించబడిన అదే మోడల్ నంబర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ BIS ధృవీకరణను కూడా పొందినట్లు నివేదికలు తెలియచేస్తున్నాయి.
కానీ, ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లు ఇంకా వెల్లడి కాలేదు. అంతేకాకుండా, దక్షిణ కొరియా టెక్ దిగ్గజం దాని తదుపరి తరం ఫోల్డబుల్ ఫోన్‌లను Galaxy Z Flip 5 మరియు Galaxy Z Fold 5 ఫోన్లను వచ్చే నెలలో దాని గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోందని ఇప్పటికే రిపోర్టులు చెప్తున్నాయి.

ప్రస్తుతం, Samsung Galaxy M34 5G యొక్క ప్రోడక్ట్ సపోర్ట్ పేజీ శాంసంగ్ ఇండియా యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో గుర్తించబడింది. ఈ ఫోన్ గురించి సంస్థ వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్ SM-M346B/DSతో జాబితా చేయబడింది, ఇది త్వరలో కాబోతోందని గ్రహించవచ్చు. ఇంకా, ఈ ఫోన్ భారతదేశంలో BIS ధృవీకరణను కూడా పొందింది. నివేదికల ప్రకారం, ఈ ఫోన్ BIS ధృవీకరణ సైట్‌లో సపోర్ట్ పేజీ లాగేనే అదే మోడల్ నంబర్‌తో లిస్ట్ చేయబడిందని వెల్లడించింది.
అయితే, ఈ జాబితాలలో ఏదీ రాబోయే శాంసంగ్ గెలాక్సీ M34 5G యొక్క ఏవైనా స్పెసిఫికేషన్‌లు లేదా ఫీచర్‌లను వెల్లడించలేదు. ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ చేయబడిన గెలాక్సీ A34 5G వంటి స్పెసిఫికేషన్‌లను ఫోన్ కలిగి ఉండవచ్చని నివేదికలు తెలియచేస్తున్నాయి.
ఇక గెలాక్సీ A34 5G యొక్క స్పెస్పీకేషన్ల వివరాలు గమనిస్తే, ఇది, పూర్తి HD+ రిజల్యూషన్‌తో 6.6 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు విజన్ బూస్టర్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఫోన్ పైన One UI 5.1తో ఆండ్రాయిడ్ 13లో నడుస్తుంది. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 1080 SoC ప్రాసెసర్ ద్వారా వస్తుంది. ఇది గరిష్టంగా 8GB RAM మరియు 256GB వరకు స్టోరేజీ తో వస్తుంది.
ఇంకా ఈ ఫోన్ యొక్క కెమెరా ఆప్టిక్స్ వివరాలు తెలుసుకుంటే, గెలాక్సీ A34 5G ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మద్దతుతో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో, రెండు కెమెరాలలో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 5-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం ఫోన్‌లో 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.
ఈ గెలాక్సీ A34 5G ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందించగలదని క్లెయిమ్ చేయబడింది. రెండు మోడల్‌లు కూడా IP67-సర్టిఫైడ్ బిల్డ్‌ను కలిగి ఉన్నాయి. డాల్బీ టెక్నాలజీ ద్వారా మెరుగుపరచబడిన స్టీరియో స్పీకర్లను ఇవి కలిగి ఉంటాయి.


Click it and Unblock the Notifications