Home
News

8GB ర్యామ్‌, 6000mAh బ్యాటరీ Samsung స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.3000 తగ్గింపు.. ఇలా చేస్తే రూ.1000 అదనపు డిస్కౌంట్‌!

శాంసంగ్‌ ఇటీవల కాలంలో తన అనేక స్మార్ట్‌ ఫోన్ల ధరలను తగ్గిస్తోంది. పాత మోడల్‌లపై భారీగా తగ్గింపు ఆఫర్లను ప్రకటన చేస్తోంది. తాజాగా శాంసంగ్‌ సంస్థ గెలాక్సీ M34 5G స్మార్ట్‌ ఫోన్‌ ధరను తగ్గించింది. ఈ Samsung Galaxy M34 5G స్మార్ట్‌ ఫోన్‌ ప్రస్తుతం భారత్‌లో రెండు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

శాంసంగ్‌ గెలాక్సీ M34 5G స్పెసిఫికేషన్లు : ఈ స్మార్ట్‌ఫోన్‌ (Samsung Smartphones Price Cut) 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1080*2340 పిక్సల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. మరియు 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది.

Samsung Galaxy M34 5G Smartphone price slashed

శాంసంగ్‌ గెలాక్సీ M34 5G OS : శాంసంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత OneUI పైన పనిచేస్తుంది. మరియు ఆక్టాకోర్‌ Exynos 1280 చిప్‌తో 8GB జతచేయబడుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 128GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలు : శాంసంగ్‌ గెలాక్సీ M34 5G స్మార్ట్‌ ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాను అమర్చారు. అదే సెల్పీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 13MP కెమెరాను కలిగి ఉంది.

Samsung Galaxy M34 5G Smartphone price slashed

శాంసంగ్ గెలాక్సీ M34 5G స్మార్ట్‌ ఫోన్‌ ధర :
శాంసంగ్ గెలాక్సీ M34 5G స్మార్ట్‌ ఫోన్‌ (Samsung Galaxy M34 5G) భారత్‌లో గత సంవత్సరం జులైలో లాంచ్‌ అయింది. ప్రస్తుతం ఈ ఫోన్ 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ మరియు 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్లపై శాంసంగ్‌ రూ.3000 చొప్పున ధరను తగ్గించింది.

ఈ బ్యాంకు కార్డుపై 1000 రూపాయల అదనపు తగ్గింపు : ఫలితంగా 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.15,999, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ.17999కు కొనుగోలు చేయవచ్చు. ICICI క్రెడిట్‌, డెబిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ మిడ్‌నైట్‌ బ్లూ, ప్రిజమ్‌ సిల్వర్ మరియు వాటర్‌ఫాల్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

Samsung Galaxy M34 5G Smartphone price slashed

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Samsung Galaxy M34 5G Smartphone receives price drop
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X