Home
News

50MP కెమెరా,Infinity-O డిస్ప్లే తో, Samsung Galaxy M35 5G ! జులై 17 న లాంచ్

శాంసంగ్ నుంచి Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ Galaxy M34 5G కి కొనసాగింపుగా మేలో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది. అయితే ఇప్పుడు, ఈ శాంసంగ్ ఫోన్ భారత మార్కెట్లో కూడా లాంచ్ కానుంది. ఈ నెల జులై 17 న అమెజాన్ ద్వారా భారత మార్కెట్లోకి ఈ తదుపరి M-సిరీస్ ప్రవేశిస్తుందని ధృవీకరించింది. అమెజాన్ లో పంచుకున్న సమాచారం ప్రకారం జూలై 20 మరియు 21 తేదీల్లో జరిగే అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో స్పెషల్‌గా గెలాక్సీ M35 లాంచ్ అవుతుందని అమెజాన్‌లో సేల్ కు వస్తుంది.

అమెజాన్‌లోని టీజర్ పేజీ ప్రకారం భారతదేశంలో గెలాక్సీ M35 డార్క్ బ్లూ, లైట్ బ్లూ మరియు గ్రే రంగులలో అందుబాటులో ఉంటుందని సూచిస్తుంది. ఈ ఫోన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయబడి ఉండడం కారణంగా, ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్‌లు మనకు తెలుసు.

Samsung Galaxy M35 5G India Launch Date Confirmed For July 17

Samsung Galaxy M35 5G స్పెసిఫికేషన్ల వివరాలు: ఈ ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ HD ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-O డిస్ప్లేతో వస్తుంది. అలాగే, దీని డిస్‌ప్లే 120 కలర్ రిఫ్రెష్ రేట్ మరియు 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు మెరుగైన సెక్యూరిటీ ఫీచర్లని కలిగి ఉంది. ఈ కొత్త శాంసంగ్ ఫోన్ ఆక్టా కోర్ ఎక్సీనోస్ 1380 చిప్‌సెట్‌తో వస్తుంది. అలాగే, మాలి-G68 MP5 GPU గ్రాఫిక్స్ కార్డ్ ఈ ఫోన్‌లో ఇవ్వబడింది. ముఖ్యంగా గేమింగ్ యూజర్లు ఈ ఫోన్‌ను నమ్మకంగా కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ M35 5G ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజీ మరియు 8GB RAM + 256GB స్టోరేజీ అనే రెండు వేరియంట్‌లలో సేల్ చేయబడుతుంది. ఈ ఫోన్ స్టోరేజీ విస్తరణకు కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు స్టోరేజీ కార్డ్‌ని ఉపయోగించడానికి ఇది మైక్రో SD కార్డ్ స్లాట్ మద్దతును కలిగి ఉంది. ప్రత్యేకంగా, ఈ ఫోన్ UI 6.1 ఆధారంగా ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ 50MP ప్రైమరీ కెమెరా + 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ + 2MP మాక్రో కెమెరా. అలాగే, ఈ శాంసంగ్ ఫోన్ సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాతో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్‌ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌కు మద్దతు ఇస్తుంది.

ఈ ఫోన్‌లో USB టైప్-సి ఆడియో, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్‌తో సహా అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఛార్జ్ చేయడానికి 25W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా కలిగి ఉంది. 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6 802.11 ax, బ్లూటూత్ 5.3, GPS, USB టైప్-C పోర్ట్ -C) ఇది వివిధ కనెక్టివిటీ మద్దతును కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియా ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy M35 5G India Launch Date Confirmed For July 17 Via Amazon. Expected Price And Specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X