అదిరే ఆఫర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎమ్ 40 విడుదల, ఓ లుక్కేసుకోండి

|

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎం40ని ఎట్టకేలకు భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.19,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ నెల 19వ తేదీ నుంచి వినియోగదారులకు లభ్యం కానుంది.

 
అదిరే ఆఫర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎమ్ 40 విడుదల, ఓ లుక్కేసుకోండి

అమెజాన్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా విక్రయించనున్నారు. ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. హెచ్ఎండీ గ్లోబల్, రియల్ మి, షియోమీ స్మార్ట్ ఫోన్ కంపెనీలకు పోటీగా శాంసంగ్ గెలాక్సీ ఎం40 సిరీస్ ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. Samsung Galaxy M40 ఫీచర్లు లాంచింగ్ సంధర్భంగా ఆఫర్లను ఓ సారి పరిశీలిద్దాం.

శాంసంగ్ గెలాక్సీ ఎం40 ఫీచర్లు

శాంసంగ్ గెలాక్సీ ఎం40 ఫీచర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ,2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ , ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ , 32, 5, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు , 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ , యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అడ్రెనో 612 GPU , 4K రికార్డింగ్, స్లో-మో, హైపర్ లాప్స్ , ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ (బ్యాక్ సైడ్), GPS/ A-GPS, USB టైప్-C port, ఫోన్ సైజు 7.9mm మందం, 168గ్రామ్స్ బరువు

రిలయన్స్ జియో ఆఫర్లు

రిలయన్స్ జియో ఆఫర్లు

డబుల్ డేటా ఆఫర్ చేస్తోంది. జియో యూజర్లు రూ.198, రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. ప్రత్యేకించి రూ.198 రీఛార్జ్ పై జియో యూజర్లు రూ.3వేల 110 విలువైన 10 రీఛార్జ్ ల వరకు పొందవచ్చు.

 వోడాఫోన్ ఐడియా ఆఫర్
 

వోడాఫోన్ ఐడియా ఆఫర్

గెలాక్సీ ఎం40 స్మార్ట్ ఫోన్ పై.. వోడాఫోన్ ఐడియా క్యాష్ బ్యాక్ అందిస్తోంది. రూ.255 తో రీఛార్జ్ చేసుకుంటే.. రూ.3వేల 750 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. రూ.75ల విలువైన రీఛార్జ్ వోచర్లతో 50 రీఛార్జ్ లు వరకు చేయించినవారికే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 18 నెలల వరకు రోజుకు 0.5GB డేటాను అదనంగా యూజర్లు పొందవచ్చు.

ఎయిర్ టెల్ ఆఫర్

ఎయిర్ టెల్ ఆఫర్

గెలాక్సీ ఎం40 స్మార్ట్ ఫోన్ కింద ఎయిర్ టెల్ తమ వినియోగదారులకు 10 నెలల వరకు అదనంగా 100 శాతం డేటాను అందిస్తోంది. రూ.249తో రీఛార్జ్ చేయిస్తే చాలు.. రోజుకు 4GB డేటాను పొందవచ్చు. అదనంగా 560GB డేటాను 10నెలల వరకు పొందవచ్చు. రూ.249 రీఛార్జ్ ప్లాన్ పై రోజుకు 6GB డేటా బెనిఫెట్ తో పాటు అదనంగా 10నెలల పాటు 840GB డేటాను పొందవచ్చు.

ఆసక్తికర ఫీచర్లు

ఆసక్తికర ఫీచర్లు

గెలాక్సీ ఎం40లో ఫుల్ హెచ్ డీ ప్లస్ ఇన్ఫినిటీ O డిస్ ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 675 SoC ఎట్రాక్టీవ్ చేసేలా ఫీచర్లు, స్పెషిఫికేషన్లు ఉన్నాయి. స్పోర్ట్స్ ‘Screen Sound' టెక్నాలజీతో వచ్చిన స్మార్ట్ ఫోన్ లో తొలి సిగ్మంట్ కూడా ఇదే. ఈ టెక్నాలజీ ద్వారా ఇయర్ ఫోన్స్ అవసరం లేకుండానే.. డిస్ ప్లే ప్యానెల్ పై ఆడియో వైబ్రేషన్స్ ఎనేబుల్ అయి ఉంది. 3,500mAh బ్యాటరీ సామర్థ్యంతో 15W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో రూపొందింది. సాధారణ ఛార్జింగ్ తో పోలిస్తే మూడు రెట్లు వేగవంతంగా ఛార్జింగ్ అవుతుంది.

 ఇతర ఫీచర్లు

ఇతర ఫీచర్లు

Samsung Galaxy M40 One UI తో ఆండ్రాయిడ్ 9.0పై మీద ఆపరేట్ కానుంది. గెలాక్సీ ఎం30లాగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎం10, ఎం20 స్మార్ట్‌ఫోన్ల జనవరిలో విడుదల చేయగా, గెలాక్సీ ఎం 30ని ఫిబ్రవరిలో లాంచ్ చేసింది. ఇందులో రెండు స్టోరేజీ వేరియంట్లు ఉన్నాయి. 4జీబీ+64 జీబీ వేరియంట్ ధర రూ.14,990 కాగా, 6జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.17,990.

Best Mobiles in India

English summary
Samsung Galaxy M40 launched in India: Price, specs, offers and more

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X