Home
News

Samsung Galaxy M42 5G బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ త్వరలోనే!! ఫీచర్స్ ఇవే...

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శామ్‌సంగ్ ఇండియాలో త్వరలోనే తన బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ M42 5Gని ఆవిష్కరించబోతోంది. ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్లు మరియు లాంచ్ తేదీ గురించి కొంతకాలంగా ఆన్‌లైన్‌లో పుకార్లు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ లో ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీని ధృవీకరించింది. శామ్సంగ్ గెలాక్సీ M42 5G ఇండియాలో 2021 ఏప్రిల్ 28 న లాంచ్ కానుంది. శామ్సంగ్ M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు పెద్ద బ్యాటరీలకు ప్రసిద్ధి చెందింది. దీనికి కొనసాగింపుగా కొత్త ఫోన్ 7,000mAh బ్యాటరీతో రానున్నట్లు సమాచారం. గెలాక్సీ M42 5G గురించి మరిన్ని ఆసక్తికరమైన ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్సంగ్ గెలాక్సీ M42 5G స్పెసిఫికేషన్లు

శామ్సంగ్ గెలాక్సీ M42 5G స్పెసిఫికేషన్లు

శామ్‌సంగ్ గెలాక్సీ M42 5G ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 750G SOC ద్వారా శక్తిని పొందుతుంది. భారతీయ వినియోగదారుల కోసం శామ్‌సంగ్ నాక్స్ సెక్యూరిటీ మరియు శామ్‌సంగ్ పేతో ఇది మరింత ముందుకు వస్తుందని భావిస్తున్నారు. అలాగే ఫోన్ యొక్క డిజైన్ అమెజాన్ లిస్టింగ్ ద్వారా చూడవచ్చు. గెలాక్సీ M42 5G సెంటర్ పైభాగంలో వాటర్ డ్రాప్ నాచ్ తో భారీ డిస్ప్లేతో వస్తుంది. దీని యొక్క ప్రత్యేకమైన బ్యాక్ డిజైన్‌లో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉండడం చూడవచ్చు.

శామ్‌సంగ్ గెలాక్సీ M42 5G కెమెరా ఫీచర్స్

శామ్‌సంగ్ గెలాక్సీ M42 5G కెమెరా ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ M42 5G స్మార్ట్‌ఫోన్ ఇండియాలో 6GB మరియు 8GB వంటి రెండు ర్యామ్ వేరియంట్లలో విడుదల కానున్నది. అలాగే 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో కూడా రాబోతున్నట్లు సమాచారం. ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో 64MP ప్రాధమిక సెన్సార్‌ను కలిగి ఉంటుందని సమాచారం. చివరిగా ఇది అతి పెద్ద భారీ 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుందని భావిస్తున్నారు.

శామ్‌సంగ్ గెలాక్సీ M42 5G ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ M42 5G ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ M42 5G ఫోన్ భారతదేశంలో శామ్‌సంగ్ నుండి రాబోయే సరసమైన 5G స్మార్ట్‌ఫోన్‌గా ఉంటుందని భావిస్తున్నారు. మునుపటి IANS నివేదిక ప్రకారం ఈ ఫోన్ రెండు వేరియంట్లలో విడుదల కానున్నది. 6GB ర్యామ్‌ బేస్ వేరియంట్‌ రూ.20,000 ధర వద్ద మరియు 8GB ర్యామ్ వేరియంట్‌ రూ.25,000 ధర వద్ద విడుదల కానున్నట్లు సమాచారం. లాంచ్ అయిన తర్వాత ఈ ఫోన్ అమెజాన్‌లో లభిస్తుందని అమెజాన్ లిస్టింగ్ ధృవీకరిస్తుంది. దీనితో పాటుగా శామ్‌సంగ్ ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ఇండియా స్టోర్స్‌లో కూడా అందుబాటులోకి రానున్నది. ఈ ధరలు ఊహించినవి కావున అసలు ధరలు తెలుసుకోవడం కోసం ఫోన్ విడుదల వరకు వేచి ఉండాలి.

Best Mobiles in India

English summary
Samsung Galaxy M42 5G Budget Smartphone India Launch Date Confirmed: Price, Specs, Features and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X