Home
News

Samsung Galaxy M42 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...

శామ్సంగ్ గెలాక్సీ M42 5G స్మార్ట్‌ఫోన్ నేడు భారతీయ మార్కెట్లో లాంచ్ అయింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750G SoC, వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో క్వాడ్ కెమెరా సెటప్, నాక్స్ సెక్యూరిటీతో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ వంటి ఫీచర్లను కలిగి ఉండడమే కాకుండా కాంటాక్ట్‌లెస్ శామ్‌సంగ్ పేను ఎనేబుల్ చేసే NFC సపోర్ట్ తో పాటుగా సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే మరియు 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి లభించే ఈ ఫోన్ అమెజాన్, శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా త్వరలో అందుబాటులోకి రానున్నది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ M42 5G ధరలు & సేల్స్ ఆఫర్స్ వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ M42 5G ధరలు & సేల్స్ ఆఫర్స్ వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ M42 5G ఫోన్ భారతదేశంలో రెండు వేరియంట్ లలో విడుదలైంది. ఇందులో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ యొక్క ధర రూ. 21,999 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర 23,999 రూపాయలు. అయితే పరిచయ ఆఫర్లలో భాగంగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ను రూ.19,999 ధర వద్ద మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ను రూ.21,999 ధర వద్ద అమెజాన్.ఇన్, శామ్సంగ్.కామ్ లో మే 1 నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఈ ఫోన్ ప్రిజం డాట్ బ్లాక్ మరియు ప్రిజం డాట్ గ్రే వంటి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M42 5G స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ M42 5G స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ M42 5G ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ UI3.1 పై రన్ అవుతుంది. ఇది 6.6-అంగుళాల HD + సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-U డిస్‌ప్లేను కలిగి ఉండి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750G SoC చేత శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ఉపయోగించి మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M42 5G క్వాడ్ కెమెరా సెటప్ ఫీచర్స్

శామ్‌సంగ్ గెలాక్సీ M42 5G క్వాడ్ కెమెరా సెటప్ ఫీచర్స్

ఇమేజింగ్ విషయానికొస్తే శామ్‌సంగ్ గెలాక్సీ M42 5G ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ GM2 ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ మరియు 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ప్యాక్ చేయబడి ఉన్నాయి. ఈ ఫోన్ కెమెరాలో సింగిల్ టేక్, నైట్ మోడ్, హైపర్‌లాప్స్, సూపర్-స్లో మోషన్, సీన్ ఆప్టిమైజర్ మరియు ఫ్లావ్ డిటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. అలాగే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ఒక ఛార్జీపై 36 గంటల టాక్‌టైమ్, 22 గంటల ఇంటర్నెట్ బ్రౌజింగ్ మరియు 34 గంటల వీడియో ప్లేని అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఇందులో నాక్స్ సెక్యూరిటీ మరియు శామ్‌సంగ్ పే ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Samsung Galaxy M42 5G Smartphone Released in India: Price, Specs, Features and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X