శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G లాంచ్ టీజ్ చేసిన అమెజాన్!! ఫీచర్స్ ఇవిగో

|

భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G లాంచ్‌ను అమెజాన్ టీజ్ చేసింది. గెలాక్సీ M సిరీస్ విభాగంలో కొత్త శామ్‌సంగ్ ఫోన్ ను ఇప్పుడు లాంచ్ చేయనున్నది. ఇప్పటివరకు రూమర్ మిల్లులో భాగమైన గెలాక్సీ M52 5G గత సంవత్సరం లాంచ్ చేయబడిన గెలాక్సీ M51 కి అప్ గ్రేడ్ గా వస్తోంది. స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G ఫోన్ 120Hz డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC తో రన్ అవుతూ 8GB RAM తో జతచేయబడి ఉన్నట్లు పుకారు ఉంది. అమెజాన్ టీజ్ చేసిన దాని ప్రకారం ఇది ట్రిపుల్ రియర్ కెమెరాలు మరియు పిన్‌స్ట్రిప్ స్టైల్ డిజైన్‌ను కూడా ధృవీకరించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గెలాక్సీ M52 5G లాంచ్‌ టీజ్

భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G లాంచ్‌ను టీజ్ చేయడానికి అమెజాన్ ఒక ప్రత్యేకమైన మైక్రోసైట్‌ని సృష్టించింది. ఈ మైక్రోసైట్ మోడల్ పేరును స్పష్టంగా పేర్కొనలేదు. అయితే ఇది గత వారం లీక్‌లో చూసినట్లుగా రెండర్‌ను కలిగి ఉంది. రెండర్ ఖచ్చితమైన నమూనాను సూచించే "SamsungGalaxy_M52_5G_LP_PC_01.png" ఫైల్ పేరును కూడా కలిగి ఉంది. ఇంకా ఇ-కామర్స్ సైట్ టీజర్ ప్రత్యేకంగా ఒక కొత్త గెలాక్సీ M- సిరీస్ ఫోన్ కోసం ఉద్దేశించబడిందని నిర్ధారిస్తుంది. ఇది ఇండియాలో త్వరలోనే లాంచ్ కానున్నది.

అమెజాన్ మైక్రోసైట్‌

మైక్రోసైట్‌లో ఫీచర్ చేయబడిన రెండర్ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగాన్ని ట్రిపుల్ రియర్ కెమెరాలు మరియు ముందు లీక్ అయిన ఇమేజ్‌లలో కనిపించే పిన్‌స్ట్రైప్-స్టైల్ డిజైన్‌ని చూపుతుంది. ప్రత్యేకంగా WinFuture.de యొక్క టిప్‌స్టర్ రోలాండ్ క్వాండ్ట్ శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G యొక్క కొన్ని అధికారిక మార్కెటింగ్ ఉత్పత్తి ఫోటోలను పోస్ట్ చేసారు. ఇది అమెజాన్ సైట్‌లో ప్రదర్శించబడిన అదే డిజైన్‌ను కూడా చూపుతుంది. Samsung Galaxy M52 5G గత సంవత్సరం ఆగస్టులో రూ.24,999 ధర వద్ద ప్రారంబించిన గెలాక్సీ M51 యొక్క వారసుడిగా భావిస్తున్నారు. అయితే గెలాక్సీ M52 5G గురించి ధర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G స్పెసిఫికేషన్స్ (ఊహించిన)

శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G స్పెసిఫికేషన్స్ (ఊహించిన)

శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ ను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 లో UI 3.1 తో రన్ కావచ్చు. మునుపటి నివేదికల ప్రకారం ఇది 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,400 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ మరియు 120HZ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఫోన్ 6GB మరియు 8GB RAM ఆప్షన్‌లతో పాటు ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ద్వారా శక్తిని పొందుతుంది. గెలాక్సీ M52 5G లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా స్టాండర్డ్ గా ఉంటుంది.

ఆప్టిక్స్

ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌ని కలిగి ఉంది. అలాగే ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉందని కూడా చెప్పబడింది. అలాగే ఇది 4G LTE, Wi-Fi, Bluetooth v5, GPS/ A-GPS మరియు USB టైప్-సి పోర్ట్ ఉంటాయి. దీని రెండర్లు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా సూచిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
Samsung Galaxy M52 5G Smartphone India Launch Teaser Reveled on Amazon

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X