శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G లాంచ్ అయింది!! అమెజాన్ పండుగ సేల్ లో అమ్మకాలు

|

ప్రముఖ దక్షిణ కొరియా కంపెనీ శామ్‌సంగ్ నేడు ఇండియాలో మిడ్-రేంజ్ విభాగంలో గత సంవత్సరం లాంచ్ చేయబడిన గెలాక్సీ M51 యొక్క అప్ గ్రేడ్ వెర్షన్ గా తాజా 5G ఫోన్‌గా శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G ను విడుదల చేసింది. దీనిని వినియోగదారులు రాబోయే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ సమయంలో ప్రత్యేక ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులోకి తీసుకొనిరానున్నది. ఈ కొత్త శామ్‌సంగ్ మోడల్ ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 120Hz సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్‌ప్లే వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC మరియు హోల్-పంచ్ డిస్‌ప్లే డిజైన్‌ను కలిగి ఉండి 7.4mm మందంతో స్లిమ్ గా ఉండి డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ తో లభిస్తూ iQoo Z5 మరియు Realme GT మాస్టర్ ఎడిషన్‌లకు పోటీగా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలను తీసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G ధరల వివరాలు

భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G ఫోన్ మూడు వేరియంట్ లలో లాంచ్ అయింది. ఇందులో 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 కాగా మరొక 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ. 31,999. అయితే అమెజాన్ దీపావళి సేల్ లో పరిమిత కాలానికి శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G ప్రత్యేక ఆఫర్ ఉంది. పరిచయ ఆఫర్లలో భాగంగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.26,999 మరియు 8GB ర్యామ్ + 128GB మోడల్ రూ.28,999 ధర వద్ద పొందవచ్చు. ఈ ఫోన్ బ్లేజింగ్ బ్లాక్ మరియు ఐసీ బ్లూ కలర్ వేరియంట్లలో వస్తుంది. ఇది అమెజాన్, Samsung.com మరియు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల ద్వారా అక్టోబర్ 3 నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ అమ్మకం తేదీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2021 కి అనుగుణంగా ఉంటుంది. అమెజాన్ ద్వారా గెలాక్సీ M52 5G కి ముందస్తు యాక్సెస్ కూడా ప్రైమ్ సభ్యులకు అందించబడుతుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G లాంచ్ ఆఫర్స్

శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G లాంచ్ ఆఫర్స్

Samsung Galaxy M52 5G ఫోన్ యొక్క లాంచ్ ఆఫర్‌ల విషయానికి వస్తే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ద్వారా కొనుగోలు చేసే HDFC బ్యాంక్ కార్డ్ వినియోగదారులకు 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ లభిస్తుంది. అదనంగా నో-కాస్ట్ EMI లావాదేవీలను కూడా కలిగి ఉంటాయి. అక్కడ కూడా సమర్థవంతమైన షాపింగ్ కూపన్‌ల ద్వారా రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. ఇంకా ఫోన్ ఆరు నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ మరియు తొమ్మిది నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలతో వస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై వన్ UI 3.1 తో నడుస్తుంది. అలాగే ఇది 6.7-అంగుళాల ఫుల్ HD+ (1,080x2,400 పిక్సెల్స్) సూపర్ AMOLED ప్లస్ డిస్‌ప్లే 20: 9 కారక నిష్పత్తితో 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM వరకు జతచేయబడి ఉంటుంది.

ఆప్టిక్స్

శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇది 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ తో మెమొరీని 1TB వరకు విస్తరణకు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్, GPS/ A-GPS, NFC మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇది 5,000WAA బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది మరియు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 48 గంటల టాక్ టైమ్ లేదా 20 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్‌ని అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy M52 5G Smartphone Released in India With 25W Fast Charging: Price, Specs, Sale Date, Sale Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X