Samsung Galaxy M53 5G స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్స్ లో రూ.2,500 వరకు డిస్కౌంట్ ఆఫర్లు! మిస్ అవ్వకండి...

|

శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఇండియాలో ఈ నెల ప్రారంభంలో గెలాక్సీ M-సిరీస్ పోర్ట్‌ఫోలియోలో కొత్తగా గెలాక్సీ M52 5G స్మార్ట్‌ఫోన్‌కు అప్ గ్రేడ్ గా గెలాక్సీ M53 5G ను లాంచ్ చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ఆధారిత SoC తో రన్ అవుతూ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల సూపర్ AMOLED+ డిస్‌ప్లేను కలిగి ఉన్న ఈ హ్యాండ్‌సెట్ 108-మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి దీని యొక్క మొదటి సేల్స్ అమెజాన్ ఇండియాలో ప్రారంభం కానున్నాయి. ధరలు మరియు లాంచ్ ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

శామ్‌సంగ్ గెలాక్సీ M53 5G ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ M53 5G ధరల వివరాలు

భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ M53 5G ఫోన్ రెండు వేరియంట్ లలో లాంచ్ అయింది. ఇందులో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ యొక్క ధర రూ.23,999 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.25,999 ధర వద్ద బ్లూ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. అమెజాన్, శామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్ మరియు రిటైల్ ఛానెల్‌ల ద్వారా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలయ్యే సేల్స్ లో పరిచయ ఆఫర్‌లో భాగంగా శామ్‌సంగ్ ICICI బ్యాంక్ కార్డ్‌లపై రూ.2,500 తక్షణ తగ్గింపును అందిస్తోంది. ఇది స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రభావవంతమైన ధరను 6GB RAM వేరియంట్‌ను రూ.23,999కి మరియు 8GB RAM వేరియంట్‌ను రూ.25,999కి తగ్గించింది. అలాగే శామ్‌సంగ్ షాప్ యాప్‌లో 20K అడ్వాంటేజ్ ప్రోగ్రామ్ కొనుగోళ్లపై 25W ట్రావెల్ అడాప్టర్‌ను రూ.2,000 ధరలోపు అందిస్తోంది. ఇది కాకుండా దీనిని నెలకు రూ.2,666.55 ధరతో నో-కాస్ట్ EMI వద్ద పొందడానికి వీలును కల్పిస్తుంది.

వన్‌ప్లస్ 10R 5G: ఇండియాలో ఇటీవలి లాంచ్లో వన్‌ప్లస్ ఫోన్‌లు ఎందుకు ప్రత్యేకంగా ఉన్నాయివన్‌ప్లస్ 10R 5G: ఇండియాలో ఇటీవలి లాంచ్లో వన్‌ప్లస్ ఫోన్‌లు ఎందుకు ప్రత్యేకంగా ఉన్నాయి

శామ్‌సంగ్ గెలాక్సీ M53 5G స్పెసిఫికేషన్స్
 

శామ్‌సంగ్ గెలాక్సీ M53 5G స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ M53 5G యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్-12 ఆధారిత One UI 4.1పై రన్ అవుతుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) ఇన్ఫినిటీ-O సూపర్ AMOLED+ డిస్‌ప్లేను కలిగి ఉంది. అదనంగా ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. హుడ్ కింద ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 SoC ద్వారా శక్తిని పొందుతూ గరిష్టంగా 8GB RAMతో జత చేయబడి వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ శామ్‌సంగ్ యొక్క 'RAM ప్లస్' ఫీచర్‌తో వస్తుంది. ఇది 8GB వరకు ఉపయోగించని స్టోరేజ్ ని వర్చువల్ RAMగా ఉపయోగించుకుంటుంది.

ఆప్టిక్స్

శామ్‌సంగ్ గెలాక్సీ M53 5G యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.8 ఎపర్చరు లెన్స్‌తో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, f/2.2 ఎపర్చరు లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా మరియు f/2.4 ఎపర్చరు లెన్స్‌లతో రెండు 2-మెగాపిక్సెల్ డెప్త్ మరియు మాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందుభాగంలో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది.

స్టోరేజ్

శామ్‌సంగ్ గెలాక్సీ M53 5G ఫోన్ 128GB అంతర్నిర్మిత స్టోరేజ్ ను కలిగి ఉండి అదనంగా మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అనువుగా ఉంటుంది. హ్యాండ్‌సెట్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, జియోమాగ్నెటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. చివరిగా ఈ స్మార్ట్‌ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి 164.7x77.0x7.4mm కొలతలతో 176g బరువును కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy M53 5G First Sale Starts Today at 12PM via Amazon and Company Website: Price, Discount offers and Deals

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X