శాంసంగ్ గెలాక్సీ M55 5G ఫోటో, స్పెసిఫికేషన్లు లీక్.. త్వరలో భారత్‌లో విడుదల..!!
శాంసంగ్ గెలాక్సీ M55 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy M55 5G Smartphone) త్వరలో భారత్ మార్కెట్‌లోకి విడుదల కానుంది. ఈ ఫోన్ గురించి ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. అయితే ఈ హ్యాండ్‌సెట్ లాంచ్‌పైన శాంసంగ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజాగా టిప్‌స్టర్ భారత్‌లో ఈ ఫోన్ లాంచ్ సహా హ్యాండ్ సెట్ ఫోటోలను షేర్ చేశారు.
ఈ ఫోటోల ఆధారంగా వెనుక ప్యానల్ డిజైన్ మరియు కలర్ ఆప్షన్ల వివరాలు వెల్లడయ్యాయి. అయితే ఈ ఫోన్ ఇప్పటికే అనేక సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో నమోదు అయింది. టిప్‌స్టర్ ముఖుల్ శర్మ తన X పోస్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ M55 5G ఈ ఫోన్ వివరాలను వెల్లడించారు. మరియు భారత్‌లో ఈ హ్యాండ్‌సెట్ విడుదల కానుందని అంచనా వేశారు.

ట్రిపుల్ కెమెరా, రెండు రంగులు.. : దీని ఆధారంగా ఈ శాంసంగ్ గెలాక్సీ M55 5G స్మార్ట్‌ఫోన్ బ్లూ, బ్లాక్ రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది. మరియు ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు LED ప్లాష్ లైట్ యూనిట్‌ను కలిగి ఉంది. వాల్యూమ్, పవర్ బటన్లు ఫోన్ కుడి వైపున ఉన్నాయి.
కొన్ని నివేదికల ప్రకారం ఈ ఫోన్ 45W వైరడ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు FCC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, వైఫై, బ్లూటూట్ సపోర్టును కలిగి ఉంటుంది. మరియు డ్యూయల్ సిమ్ కార్డులను కలిగి ఉంటుంది.
గతంలో గీక్ బెంచ్‌లో మోడల్ నంబర్ SM-M556B తో కనిపించింది. ఈ నివేదిక ఆధారంగా ఈ శాంసంగ్ గెలాక్సీ M55 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మరియు అడెన్నో (TM) 644 GPU తో జతచేయబడుతుంది. 8GB ర్యామ్‌తోనూ జతచేయబడుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI పైన పనిచేస్తుంది.
ఈ శాంసంగ్ గెలాక్సీ M55 5G స్మార్ట్‌ఫోన్.. M54 5G హ్యాండ్‌సెట్‌కు తర్వాత తరం ఫోన్‌గా వస్తుందని తెలుస్తోంది. M54 5G ఫోన్ Exynos 1380 SoC చిప్‌సెట్‌తో 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేయబడింది. మరియు 108MP ప్రైమరి కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్, 2MP మ్యాక్రో కెమెరా సహ 32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. మరియు 6000mAh బ్యాటరీ సహా 25W ఛార్జింగ్ సపోర్టుతో వచ్చింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








