ఇండియా శాంసంగ్ గెలాక్సీ నోట్ 10, 10 ప్లస్ ధరలు ఇవే

By Gizbot Bureau
|

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ సంస్థ గెలాక్సీ నోట్ సిరీస్‌లో తన నూతన స్మార్ట్‌ఫోన్లు నోట్ 10, నోట్ 10 ప్లస్‌లను విడుదల చేసిన విషయం విదితమే. న్యూయార్క్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో కంపెనీ ఈ ఫోన్లను లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్లకు గాను శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం మాల్, టాటా క్లిక్‌లలో ప్రీ ఆర్డర్లను ప్రారంభించామని శాంసంగ్ తెలిపింది.

ఇండియా శాంసంగ్ గెలాక్సీ నోట్ 10, 10 ప్లస్ ధరలు ఇవే

 

ఈ నెల 22వ తేదీ వరకు ప్రీ ఆర్డర్లను స్వీకరిస్తామని, అలాగే ఈ నెల 23వ తేదీ నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా దేశాల మార్కెట్లలోనూ ఈ ఫోన్లను విక్రయించనున్నట్లు శాంసంగ్ తెలియజేసింది. భారత్‌లో గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్ ఫోన్ల ధరలను కూడా శాంసంగ్ వెల్లడించింది.

భారత్ లో ఫోన్ల ధరలు

భారత్ లో ఫోన్ల ధరలు

శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 (8జీబీ + 256జీబీ) - రూ.69,999

శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ (12జీబీ + 256జీబీ) - రూ.79,999

శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ (12జీబీ + 512జీబీ) - రూ.89,999

 లాంచింగ్ ఆఫర్లు

లాంచింగ్ ఆఫర్లు

ఇక ఈ ఫోన్లపై పలు లాంచింగ్ ఆఫర్లను కూడా అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్లను ప్రీ బుకింగ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.6వేల క్యాష్‌బ్యాక్ ఇస్తారు. ఐసీఐసీఐ కార్డులతో ప్రీబుకింగ్ చేసి ఈ-కామర్స్ సైట్లలో ఈ ఫోన్లను కొంటే రూ.6వేల క్యాష్‌బ్యాక్ ఇస్తారు. అలాగే ఈ ఫోన్లను కొన్న యూజర్లకు రూ.19,990 ధర కలిగిన గెలాక్సీ వాచ్ యాక్టివ్ స్మార్ట్‌వాచ్‌ను కేవలం రూ.9,999 ధరకే అందివ్వనున్నారు.

గెలాక్సీ నోట్‌ 10 పూర్తి ఫీచర్లు
 

గెలాక్సీ నోట్‌ 10 పూర్తి ఫీచర్లు

6.3 క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, శాంసంగ్‌ ఎగ్సినోస్‌ 9825 ప్రాసెసర్‌, 10 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 12+16+12 ఎంపీ వెనుక కెమెరా, పంచ్ హోల్ కెమెరా, 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 9 పై ఓఎస్‌, 1080x2280 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, డిస్‌ప్లేల కింద అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, యాంటీ స్పూఫింగ్ ఫీచర్‌, బ్లూటూత్‌ ఎస్ పెన్ స్టయిలస్‌, ఎస్ పెన్‌లో బిల్టిన్ లిథియం టైటానేట్ బ్యాటరీ, 3డీ రెండరింగ్ విత్ 3డీ స్కానింగ్, శాంసంగ్ బిక్స్‌బీ వాయిస్ అసిస్టెంట్, శాంసంగ్ హెల్త్, శాంసంగ్ పే, శాంసంగ్ డెక్స్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్, ఫాస్ట్ చార్జింగ్, ఫాస్ట్ వైర్‌లెస్ చార్జింగ్ 2.0, వైర్‌లెస్ పవర్‌షేర్, క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌

గెలాక్సీ నోట్‌ 10+ పూర్తి ఫీచర్లు

గెలాక్సీ నోట్‌ 10+ పూర్తి ఫీచర్లు

6.8 క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, శాంసంగ్‌ ఎగ్సినోస్‌ 9825 ప్రాసెసర్‌, స్నాప్‌డ్రాగన్ ఎక్స్50 మోడెమ్ ( 5జీ వేరియెంట్‌),10 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 12+16+12+0.3 ఎంపీ వెనుక కెమెరా, పంచ్ హోల్ కెమెరా, 4300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 9 పై ఓఎస్‌, 1440x3040 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, డిస్‌ప్లేల కింద అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, యాంటీ స్పూఫింగ్ ఫీచర్‌, బ్లూటూత్‌ ఎస్ పెన్ స్టయిలస్‌, ఎస్ పెన్‌లో బిల్టిన్ లిథియం టైటానేట్ బ్యాటరీ, 3డీ రెండరింగ్ విత్ 3డీ స్కానింగ్, శాంసంగ్ బిక్స్‌బీ వాయిస్ అసిస్టెంట్, శాంసంగ్ హెల్త్, శాంసంగ్ పే, శాంసంగ్ డెక్స్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్, ఫాస్ట్ చార్జింగ్, ఫాస్ట్ వైర్‌లెస్ చార్జింగ్ 2.0, వైర్‌లెస్ పవర్‌షేర్, క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌, సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung Galaxy Note 10, Galaxy Note 10+ Price in India Revealed, Sales Start August 23

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X