ఆ ఫోటో పై బలపడుతున్న అనుమానాలు?

Posted By: Prashanth

ఆ ఫోటో పై బలపడుతున్న అనుమానాలు?

 

దక్షిణ కొరియా సాంకేతిక దిగ్గజం సామ్‌సంగ్ త్వరలో ఆవిష్కరించనున్న ఫాబ్లెట్ ‘సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2’ పై భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ డివైజ్‌కు సంబంధించిన అనధికారిక స్పెసిఫికేషన్‌లు ఇప్పటికే వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. అధికారికంగా తెలిసిన సమాచారం మేరకు గెలాక్సీ నోట్ 2ను ఆగష్టు 29న నిర్వహించనున్న ప్రీ-ఐఎఫ్ఏ 2012 (pre-IFA 2012) కార్యక్రమంలో ఆవిష్కరిస్తారు.

ఆన్‌లైన్‌లో ఆ అనుమానాస్పద ఫోట్!

ప్రముఖ టెక్నాలజీ సైట్ జీఎస్ఎమ్ ఎరీనా( GSMArena) గెలాక్సీ నోట్ 2కు సంబంధించిన అనుమానాస్పద ఫోటోను ప్రచురించింది. ఈ ఫోటోలో ఫాబ్లెట్ ముందు భాగం మాత్రమే కినిపిస్తోంది. ఈ ఫోటో పై నిశిత పరిశీలన జరిపిన టెక్ కోవిదులు గెలాక్సీ ఎస్3 డిజైన్ స్పూర్తితో నోట్ 2 ను డిజైన్ చేసి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

అగష్టు 29న విడుదల కాబోతున్న సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2 ఫీచర్లు(అంచనా):

5.5. అంగుళాల ఫ్లెక్సిబుల్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1680 x 1050పిక్సల్స్),

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

ఆర్మ్ కార్టెక్స్ ఏ15 ఆధారిత Exynos 5250ప్రాసెసర్,

5జీబి ర్యామ్,

13 మెగాపిక్సల్ కెమెరా.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting