వచ్చేది కూడా సూపర్ హిట్టే..?

Posted By: Prashanth

వచ్చేది కూడా సూపర్ హిట్టే..?

 

ఏడాది క్రితం మార్కెట్లో విడుదలైన ‘సామ్‌సంగ్ గెలాక్సీ నోట్’ టెక్నాలజీ విపణిలో కొత్త ఒరవడిని సృష్టించిన విషయం తెలిసిందే. స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ పీసీల కలయకతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ ‘ఫాబ్లెట్’ ఇప్పటివరకు షుమారు 7 మిలియన్ల యూనిట్‌లు అమ్ముడైనట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. గెలాక్సీ నోట్ పై నెలకున్న క్రేజ్‌ను కొనసాగించే ప్రయత్నంగా సామ్‌సంగ్, గెలాక్సీ నోట్ 2ను వృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ డివైజ్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి అధికారికంగా ఏ విధమైన సమాచారం లేదు.

గెలాక్సీ ఎస్3 ప్రపంచ వ్యాప్తంగా విడుదలై హాట్ కేకుల్లో అమ్ముడవుతున్న నేపధ్యంలో గెలాక్నీ నోట్2 పై భారీ స్థాయిలో అంచనాలు నెలకున్నాయి. ఆపిల్ ఐఫోన్ 5ను సెప్టంబర్‌లో ఆవిష్కరించనున్న నేపధ్యంలో దానికి పోటీగా అక్టోబర్‌లో గెలాక్సీ నోట్ 2 లాంచ్ ఉండొచ్చని పుకార్లు వ్యక్తమవుతున్నాయి. ఆధునీకతకు పెద్దపీటవేసే సామ్‌సంగ్ రాబోయే గెలాక్సీ నోట్ 2‌లో స్మార్ట్ స్టే, ఎస్‌వాయిస్, ఎస్ బీమ్ తరహా ఫీచర్లను నిక్షిప్తం చేసే అవకాశముందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

సామ్‌సంగ్ గెలాక్నీ నోట్ ఫీచర్లు (అంచనా):

5.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే,

రిసల్యూషన్ (1680 x 1050పిక్సల్స్),

Exynos 5250 ప్రాసెసర్,

8 మెగా పిక్సల్ కెమెరా,

1.5జీబి ర్యామ్,

4జీ ఎల్‌టీఈ కనెక్టువిటీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot