అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన Samsung Galaxy Note 20 సిరీస్ ఫోన్లు.

By Maheswara
|

ఎన్నో పుకార్లు మరియు ఊహాగానాల తరువాత, ఎట్టకేలకు శామ్‌సంగ్ తన గెలాక్సీ నోట్ 20 సిరీస్ ను ఈ రోజు రాత్రి 7:30 గంటలకు Unpacked 2020 ఈవెంట్‌లో విడుదల చేసింది.గెలాక్సీ నోట్ 20 సిరీస్‌తో పాటు, దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం గెలాక్సీ టాబ్ ఎస్ 7, గెలాక్సీ వాచ్ 3, గెలాక్సీ బడ్స్ లైవ్ మరియు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 గా పిలువబడే ఫోల్డబుల్ ఫోన్‌తో సహా మరికొన్ని ఉత్పత్తులను కూడా విడుదల చేసారు.

Samsung Galaxy Note 20, 20 Ultra Launched In Unpacked 2020 Event 

గెలాక్సీ నోట్ 20 ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు.
గెలాక్సీ నోట్ 20 మరియు గెలాక్సీ నోట్ 20 అల్ట్రా వరుసగా 6.7 ఇంచ్ మరియు 6.9 ఇంచుల స్క్రీన్ కలిగి ఉంటాయి.నోట్ 20 ,8GB RAM తో మాత్రమే వస్తుంది.ఇది 4G మరియు 5G రెండు ఎంపికలలో మీరు పొందవచ్చు.మరియు నోట్ 20 అల్ట్రా 8GB RAM మరియు 12GB RAM లతో వస్తుంది.ఇది కూడా 4G మరియు 5G ఆప్షన్ లలో ఎంచుకోవచ్చు.ఈ సిరీస్ లో వచ్చే రెండు ఫోన్లలోనూ 1 TB వరకు మెమొరీ ని పెంచుకునే అవకాశం ఉంది.గెలాక్సీ నోట్ 20 అల్ట్రాలో హైబ్రిడ్ సిమ్ ట్రే మాత్రమే లభిస్తుంది

Samsung Galaxy Note 20, 20 Ultra Launched In Unpacked 2020 Event 

ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్ ద్వారా శక్తినివ్వనుంది మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో రావడం ఖాయం. ఈ పరికరం వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది, ఇందులో 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు 12MP 5x పెరిస్కోప్ లెన్స్‌తో జతచేయబడిన 108MP ప్రాధమిక సెన్సార్ ఉంటుంది.

Samsung Galaxy Note 20, 20 Ultra Launched In Unpacked 2020 Event 

ఈ ఈవెంట్ లో ముఖ్యమైన లాంచ్ గా పేర్కొంటున్న గేలక్సీ నోట్ 20 సిరీస్ ‌ను కంపెనీ విడుదల చేసింది.నోట్ 20 సిరీస్ లో రెండు వేరియంట్‌లు ఉంటాయి.సాధారణ వేరియంట్ మరియు అల్ట్రా వేరియంట్. భారతదేశంలో ఈ శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాల గురించి మాట్లాడుతూ, ఈ స్మార్ట్‌ఫోన్‌లు కాంస్య, ఆకుపచ్చ మరియు నలుపు రంగు ఎంపికలలో లభిస్తాయి .గెలాక్సీ నోట్ 20 సిరీస్ మరియు టాబ్ ఎస్ 7 సిరీస్, ఆగస్టు 21,2020 నుండి మార్కెట్లలో లభిస్తాయి.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung Galaxy Note 20, 20 Ultra Launched In Unpacked 2020 Event 

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X