Galaxy Note 20 స్మార్ట్‌ఫోన్‌ను రూ.15,000 తగ్గింపు ధరతో కొనుగోలు చేసే గొప్ప ఛాన్స్!! మిస్ అవ్వకండి..
శామ్సంగ్ సంస్థ ఇప్పుడు 'శామ్సంగ్ డేస్' సేల్ ను ప్రకటించింది. ఈ సేల్స్ నేటి నుంచి 2020 సెప్టెంబర్ 23 వరకు జరగనున్నాయి. ఇందులో శామ్సంగ్ యొక్క ప్రీమియం స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 20 మీద భారీ తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. శామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 స్మార్ట్‌ఫోన్ ను మిస్టిక్ బ్రోన్స్, మిస్టిక్ గ్రీన్ మరియు మిస్టిక్ బ్లూ వంటి మూడు కలర్ ఎంపికలలో కొనుగోలు చెయవచ్చు. దీనిని సామ్‌సంగ్.కామ్, శామ్‌సంగ్ స్టోర్, ఆన్‌లైన్ పోర్టల్స్ మరియు రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ ఆఫర్స్
శామ్సంగ్ ప్రీమియం ఫోన్ గెలాక్సీ నోట్ 20 స్మార్ట్‌ఫోన్ యొక్క సాధారణ ధర రూ.77,999. ఈ ధర గల గెలాక్సీ నోట్ 20 ప్రస్తుత అమ్మకం సమయంలో ఇప్పుడు రూ.9,000 ఫ్లాట్ డిస్కౌంట్ ను అందిస్తున్నది. ఇదే కాకుండా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ.6,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంటే అన్ని రకాల ఆఫర్లతో కలిపి దీనిని కేవలం రూ.62,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 సూపర్ అమోలెడ్ డిస్ప్లే స్పెసిఫికేషన్స్
శామ్సంగ్ యొక్క కొత్త ప్రీమియం గెలాక్సీ నోట్ 20 స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల డిస్ప్లేను ఫుల్ HD + రిజల్యూషన్ మరియు సూపర్ అమోలెడ్ ప్యానెల్ తో 720 x 1280 పిక్సెల్స్ పరిమాణంలో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 12 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ మరియు 64 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలను కలిగి ఉన్నాయి. దీనితో పాటుగా సెల్ఫీల కోసం ముందుభాగంలో 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 ఆక్టా-కోర్ ప్రాసెసర్
శామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 స్మార్ట్‌ఫోన్ పనితీరు కోసం ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి ఉంటుంది. ఇది 4,300mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 23 గంటల టాక్‌టైమ్, 14 గంటల ఇంటర్నెట్ వాడకం కోసం మరియు వై-ఫై ద్వారా 16 గంటల వరకు ఇంటర్నెట్ వినియోగాన్ని అందిస్తుంది.


Click it and Unblock the Notifications