జీపులో పేలిన సామ్‌సంగ్ ఫోన్
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్ పేలుళ్లు యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోన్న నేపథ్యంలో మరో బాధాకర సంఘటన చోటుచేసుకుంది.

Read More : WhatsAppలో 16 ఎంబి కంటే పెద్ద సైజు వీడియోలను షేర్ చేయటం ఎలా..?
ఫ్లోరిడాకు చెందిన బాధితుడు నాతన్ డోర్నాచర్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించిన వివరాల ప్రకారం తన జీపులో ఛార్జ్ అవుతోన్న గెలాక్సీ ఎస్7 ఒక్కసారిగా పేలుడుకు గురువటంతో ఆ మంటల్లో జీపు మొత్తం తగలబడిపోయింది.
అదృష్టవశాత్తూ ఆ సమయంలో జీపులో ఎవరు లేరని, ఉండి ఉంటే పెను ప్రమాదం తప్పేది కాదని నాతన్ సదురు సోషల్ మీడియాలో పోస్ట్‌లో పేర్కొన్నారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటన పై తక్షణమే స్సందించిన సామ్‌సంగ్ యాజమాన్యం సమగ్ర దర్యాప్తుగా ఆదేశించినట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియాలో చోటు చేసుకునన్న మరో సంఘటనలో చార్జ్ అవుతోన్న గెలాక్సీ ఎస్7 ఫోన్ నుంచి మంటలు వ్యాపించి ఇల్లు దగ్దమైనట్లు తెలుస్తోంది. దక్షిణ Carolinaకు చెందిన మరో వ్యక్తి తన ఛార్జింగ్‌లో ఉన్న గెలాక్సీ ఎస్7 పేలుడుకు గురై గ్యారేజ్ మొత్తం అగ్నికి అహుతైనట్లు తెలుస్తోంది. హోటల్ గదిలో నిద్రిస్తున్న ఒక వ్యక్తికి సంబంధించిన సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7 పేలుడుకు గురైన సంఘటన ఇటీవల ఆస్ట్రేలియాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. శాంసంగ్ గెలాక్సీ నోట్ 7కు సంబంధించి ఇప్పటివరకూ 38 పేలిన కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కంపెనీ ఇప్పటికే గెలాక్సీ నోట్ 7 కొనుగోలు చేసిన వారికి ముందస్తు జాగ్రత్తాలు జారీ చేసింది. ఫోన్‌ను ఎట్టిపరిస్థితిలో ఆన్ చేయవద్దని కంపెనీ వాటిని వెనక్కు తీసుకునే వరకూ వాటిని స్విచ్ ఆఫ్ చేసి ఉంచాలని తమ వినియోగదారులకు సూచించింది.. బ్యాటరీ లోపం కారణంగా గెలాక్సీ ఎస్7 ఫోన్‌లు అన్ని చోట్లా పేలిపోతుండంటంతో త్తం ఫోన్లను వెనక్కు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నష్టం కంపెనీకి కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవాలి. తాజా పరిణామాల నేపథ్యంలో విమానాల్లో ప్రయాణికులు సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7 తీసుకురావొద్దని భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియా వంటి ప్రముఖ దేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాయి.
#1

#12

#3

#4

#5

#6

#7

#8

#9


Click it and Unblock the Notifications








