నోట్ 7 ఫోన్‌ల తయారీని నిలిపేసిన సామ్‌సంగ్..?

గెలాక్సీ నోట్ 7 రీప్లేస్ మెంట్‌ఫోన్‌లలోనూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తుండటంతో సామ్‌సంగ్ తప ఫ్లాగ్‌షిప్ ఫాబ్లెట్ తయారీని తాత్కాలికంగా నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. సౌత్ కొరియన్ న్యూస్ ఏజెన్సీస్ ప్రకారం గెలాక్సీ నోట్ 7 ప్రొడక్షన్ ప్రక్రియను తాత్కిలికంగా సామ్‌సంగ్ నిలిపివేసినట్లు తెలియవచ్చింది.

Read More : మీ వద్ద పాత ఫోన్ ఉందా..? ఆ ఫోన్ పై రెట్టింపు లాభం రావాలంటే ?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోట్ 7 గ్లోబల్ షిప్‌మెంట్ బాధ్యతలను

గెలాక్సీ నోట్ 7 గ్లోబల్ షిప్‌మెంట్ బాధ్యతలను వియాత్నంలోని సామ్‌సంగ్ తయారీ ప్లాంట్ చూసుకుంటోంది. గెలాక్సీ నోట్ 7 ఫోన్‌లను నిలిపిస్తేన్నట్లు సామ్‌సంగ్ ఇప్పటి వరకు ఏ విధమైన అధికారిక ప్రకటనను వెలువరించలేదు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇండియా లాంచ్‌కు సంబంధించిన వివరాలు

గెలాక్సీ నోట్ 7 ఇండియా లాంచ్‌కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఎక్స్‌ప్లోజివ్ బ్యాటరీ‌ల కారణంగా గెలాక్సీ నోట్ 7 ఫోన్‌లు చాలా చోట్ల పేలిపోవడంతో సామ్‌సంగ్ వాటిని రీకాల్ చేసిన వాటి స్థానంలో కొత్త యూనిట్‌లను కస్టమర్‌లకు అందజేస్తోంది.

తిప్పలు తప్పటం లేదు

అయితే బ్యాటరీ సమస్యను సవరించి ‘safe' గెలాక్సీ నోట్ 7 ఫోన్‌లను తమ వినియోగదారులకు అందిస్తున్నప్పటికి సామ్‌సంగ్‌కు తిప్పలు తప్పటం లేదు. సేఫ్ అని నిర్థారించబడిన నోట్ 7 ఫోన్‌లు సైతం పేలిపోతుండటంతో సామ్‌సంగ్‌కు ఏం చేయాలో అర్థం కావటం లేదు.

అప్రమత్తమైన విమానయాన సంస్థలు

ఇటీవల అమెరికాకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లో రీప్లేసుడ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్ పేలుడుకు గురికాగా, ఇటువంటి సంఘటనలే తాజాగా మరో రెండు నమోదయ్యాయి. దీంతో అమెరికాకు చెందిన రెండు ప్రముఖ విమానయాన సంస్థలు ఈ ఫోన్‌లను తీసుకెళ్లడానికి వీల్లేదంటూ తమ ప్యాసెంజర్లను హెచ్చరిస్తున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు నిలిచిపోయాయి..

అమెరికాలోని ఎల్2అండ్‌టీ , టీ మొబైల్ వంటి సంస్థలు కూడా గెలాక్సీ నోట్ 7 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.

ఈ ప్రభావం ఇతర ఫోన్‌ల పై

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌ల పై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతుండటంతో ఈ ప్రభావం సామ్‌సంగ్‌కు చెందిన ఇతర ఫోన్‌ల పై పడింది. సామ్‌సంగ్ ఫోన్‌లను ఎంపిక చేసుకునే విషయంలో యూజర్లు ఆలోచిస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy Note 7 production temporarily halted..?, Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot