గెలాక్సీ నోట్ ఎడ్జ్ యూజర్ల కోసం 10 బెస్ట్ ట్రిక్స్

Posted By:

సామ్‌సంగ్ నుంచి పరిచయమైన విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ నోట్ ఎడ్జ్'. వొంపుతిరిగిన 5.6 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 2560 x 1440పిక్సల్స్)ను ఈ ఫోన్ కలిగి ఉంది. 2.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్‌ను డివైస్‌లో అమర్చారు. నిక్షిప్తం చేసిన 3జీబి ర్యామ్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌కు ఉపకరిస్తుంది.ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై గెలాక్సీ నోట్ ఎడ్జ్ రన్ అవుతుంది. 32జీబి ఇంకా 64జీబి మెమరీ వేరియంట్‌లలో ఈ కర్వుడ్ హ్యాండ్‌సెట్ లభ్యంకానుంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని మరింతగా విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు. 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. గెలాక్సీ నోట్ ఎడ్జ్ యూజర్ల కోసం పలు బెస్ట్ ట్రిక్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ నోట్ ఎడ్జ్ యూజర్ల కోసం 10 బెస్ట్ ట్రిక్స్

కాంటాక్ట్‌లన్ని డిలీట్ చేసేందుకు

ముందుగా ఫోన్‌లోని కాంటాక్ట్స్‌లోకి వెళ్లండి. ఆ తరువాత మెనూ బటన్‌ను ప్రెస్ చేసి డిలీట్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. స్ర్కీన్ పై భాగంలో కనిపించే సెలక్ట్ ఆల్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని డిలీట్ బటన్ నొక్కండి.

 

గెలాక్సీ నోట్ ఎడ్జ్ యూజర్ల కోసం 10 బెస్ట్ ట్రిక్స్

కాంటాక్ట్‌లను వేగంగా సెర్చ్ చేసేందుకు

ముందు కాంటాక్ట్స్ మెనూలోకి వెళ్లండి. మెనూలోని స్ర్కీన్ పై భాగంలో కనిపించే సెర్చ్ బార్ లో పేర్లను టైప్ చేసి కావల్సిన కాంటాక్ట్‌లను వేగంగా పొందండి.

 

గెలాక్సీ నోట్ ఎడ్జ్ యూజర్ల కోసం 10 బెస్ట్ ట్రిక్స్

డిక్షనరీలో పదాన్ని సేవ్ చేసుకునేందుకు

డిక్షనరీలో లేని పదాన్ని మీ ఫోన్ లో టైప్ చేసిన వెంటనే ఆ పదానికి సంబంధించి ఎడమ వైపు ఓ సజెషన్ బాక్స్ ప్రత్యక్షమవుతుంది. ఆ పదం పై కొద్ది సెకన్ల పాటు ప్రెస్ చేసి ఉంచినట్లేయితే డిక్షనరీలో సేవ్ అవుతుంది.

 

గెలాక్సీ నోట్ ఎడ్జ్ యూజర్ల కోసం 10 బెస్ట్ ట్రిక్స్

పెద్ద పెద్ద అప్లికేషన్‌లను రిమూబ్ చేయాలంటే

సెట్టింగ్స్‌లోకి వెళ్లి మోర్ ఆఫ్షన్‌ను ఎంపికచేసుకుని అప్లికేషన్ మేనేజర్‌ను ఓపెన్ చేసినట్లయితే ఏఏ అప్లికేషన్ ఎంతెంత మెమరీని ఖర్చు చేస్తుందో మీకు తెలుస్తుంది. వాటిలో ఎక్కువ మెమరీని ఖర్చుచేస్తున్న యాప్ ను సెలక్ట్ చేసుకుని రిమూవ్ చేయండి.

 

గెలాక్సీ నోట్ ఎడ్జ్ యూజర్ల కోసం 10 బెస్ట్ ట్రిక్స్

గూగుల్ సెర్చ్ బార్‌ను రిమూవ్ చేయాలంటే

సెట్టింగ్స్‌లోని అప్లికేషన్ మేనేజర్‌‌లోకి వెళ్లి గూగుల్ సెర్చ్ బార్ ను సెలక్ట్ చేసుకుని డిసేబుల్ చేస్తే సరి.

 

గెలాక్సీ నోట్ ఎడ్జ్ యూజర్ల కోసం 10 బెస్ట్ ట్రిక్స్

లాక్ స్ర్కీన్ పై నోటిఫికేషన్‌లను చూడాలంటే

గూగుల్ ప్లే స్టోర్ నుంచి NoLed అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

 

గెలాక్సీ నోట్ ఎడ్జ్ యూజర్ల కోసం 10 బెస్ట్ ట్రిక్స్

మంచి కీబోర్డ్‌కు మారటం ఏలా..?

గూగుల్ ప్లే స్టోర్‌లో అనేక కీబోర్డ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో మంచి రేటింగ్ సొంతం చేసుకున్న కీబోర్డ్ యాప్‌లను పొందండి. ఉదాహరణకు Swiftkey.

 

గెలాక్సీ నోట్ ఎడ్జ్ యూజర్ల కోసం 10 బెస్ట్ ట్రిక్స్


హోమ్ స్ర్కీన్ పై విడ్జెట్‌ను యాడ్ చేయటం ఏలా..?

హోమ్ స్ర్కీన్ పై కొత్త విడ్జెట్‌ను యాడ్ చేయాలంటే మందుగా ఫోన్ హోమ్ స్ర్కీన్ పై లాంగ్ ప్రెస్ ఇవ్వండి. ఇప్పుడు కొన్ని విడ్జెట్‌లు ఓపెన్ అవుతాయి. వాటిలో కావల్సిన విడ్జెట్‌ను సెలక్ట్ చేసుకోండి.

 

గెలాక్సీ నోట్ ఎడ్జ్ యూజర్ల కోసం 10 బెస్ట్ ట్రిక్స్

స్ర్కీన్ షాట్ తీసుకోవాలంటే..?

ఫోన్‌లో స్ర్కీన్ షాట్‌లను తీసుకోవాలంటే వాల్యుమ్ డౌన్ అలానే పవర్ బటన్‌లను హోల్డ్ చేసి ఉంచండి.

 

గెలాక్సీ నోట్ ఎడ్జ్ యూజర్ల కోసం 10 బెస్ట్ ట్రిక్స్

హోమ్ స్ర్కీన్ విడ్జెట్‌లను రీసైజ్ చేయాలంటే..?

హోమ్ స్ర్కీన్ విడ్జెట్‌లను రీసైజ్ చేయాలంటే ముందుకు విడ్జెట్‌ను కొద్ది సెకన్ల పాటు ప్రెస్ చేసి ఉంచండి. సదరు విడ్జెట్ రిసైట్ అయ్యే అవకాశం ఉన్నట్లయితే ఓ అవుట్ లైన్ కనిపిస్తుంది. ఆ అవుట్ టైన్ కావల్సిన సైజులో డ్రాగ్ చేసుకుని హోమ్ స్ర్కీన్ విడ్జెట్‌ను రీసైజ్ చేసుకోవచ్చు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy Note Edge Tips and Tricks. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot