Home
News

Samsung గెలాక్సీ రింగ్ ఇండియా ధర లీకైంది! స్పెసిఫికేషన్ల వివరాలు  

శాంసంగ్ నుంచి Samsung Galaxy Ring అధికారికంగా జూలై 10న విడుదల కానుంది. అయితే, ఇప్పుడు లాంచ్‌కు ముందే, ఈ కొత్త శాంసంగ్ హెల్త్ పరికరాలపై చాలా ఊహాగానాలు వెలుబడ్డాయి. ధర వివరాలు కూడా లీక్ అయ్యాయి వివరాలు ఇక్కడ చూడండి.

ప్రముఖ టిప్‌స్టర్ Mogesh Brar సమాచారం ప్రకారం US మరియు భారతీయ మార్కెట్లలో గెలాక్సీ రింగ్ యొక్క అంచనా ధరపై కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. శామ్సంగ్ గెలాక్సీ రింగ్‌ను రాబోయే ఉత్పత్తిగా అధికారికంగా ధృవీకరించినప్పటికీ, ఈ ఉత్పత్తికి సంబంధించిన అనేక స్పెసిఫికేషన్లు తెలియవు.

Samsung Galaxy Ring India Price Leaked  Expected To Launch On July 10

శాంసంగ్ గెలాక్సీ రింగ్ అనేది అనేక ఆరోగ్య పర్యవేక్షణ ఫీచర్‌లతో వచ్చే ధరించగలిగే ప్రీమియం స్మార్ట్ రింగ్. ఇది US లో అంచనా ధర శ్రేణి $300 మరియు $350 మధ్య ఉండగా, భారతదేశంలో దీని ధర రూ. 35,000 వరకు ఉంటుందని అంచనాలున్నాయి. లీక్ ల ప్రకారం, EU మరియు UK వంటి ఇతర మార్కెట్లలో ధరలు పేర్కొన్న ధర బ్యాండ్ నుండి భిన్నంగా ఉండవచ్చు.

ఈ శాంసంగ్ గెలాక్సీ రింగ్ యొక్క అంచనా ధర ఇప్పటికే మార్కెట్లో ఉన్న కొన్ని పోటీ ఉత్పత్తులతో సమానంగా ఉంది. ఉదాహరణకు, ఔరా రింగ్ ధర సుమారు $299 గా ఉంది.

ఇంకా, నివేదికల ప్రకారం ఈ గెలాక్సీ రింగ్ సబ్‌స్క్రిప్షన్ సేవతో కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే, మీరు నెలకు కొంత మొత్తం చెల్లించి వాడుకోవడానికి వీలుంటుంది. ఈ పరికరం ఔరా రింగ్, యాపిల్ మరియు ఫిట్‌బిట్ ఉత్పత్తులతో సమానంగా దానిలానే ఉంటుంది.సబ్‌స్క్రిప్షన్ సభ్యత్వం కోసం నెలవారీ రుసుము $10 కంటే తక్కువగా ఉంటుంది.

డిజిటల్ ఉత్పత్తి సబ్‌స్క్రిప్షన్‌ల కోసం ఇప్పటికే అత్యంత పోటీతత్వం ఉన్న ప్రదేశంలో సబ్‌స్క్రిప్షన్ సేవ యొక్క స్వభావాన్ని చూడవలసి ఉంది. శాంసంగ్ గెలాక్సీ రింగ్ కోసం సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీపై ఇంకా నిర్ధారణ లేదు.

ప్రస్తుతం, శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 లో అందుబాటులో ఉన్న ఆరోగ్య మరియు ఫిట్‌నెస్ ఫీచర్ల యొక్క పూర్తి ఫీచర్లను యాక్సెస్ చేయడానికి అదనపు సభ్యత్వం అవసరం లేదు. అయితే జూలై 10 శాంసంగ్ గెలాక్సీ లాంచ్ ఈవెంట్‌తో ఈ పరిస్థితులు మారవచ్చు.

శాంసంగ్ నుంచి Galaxy Watch 7 సిరీస్‌ని రాబోయే అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్ లో ఆవిష్కరించాలని భావిస్తున్నట్లు నివేదికలు వెలుబడ్డాయి.ఈ కొత్త సమాచారం తో నివేదికలు పరిశీలిస్తే, ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) సర్టిఫికేషన్‌లో కూడా Samsung Galaxy Watch 7 ని గుర్తించాము.దీనితో పాటు, FCCలో మరొక గెలాక్సీ స్మార్ట్‌వాచ్‌ని కూడా గుర్తించాము, అది Samsung Galaxy Watch FE కావచ్చు.

SM-L300, SM-L305, SM-L310 మరియు SM-L315 అనే మోడల్ నంబర్‌లతో రాబోయే శాంసంగ్ గెలాక్సీ వాచీ లు FCC సర్టిఫికేషన్‌లో గుర్తించబడ్డాయి. SM-L300 మరియు SM-L310 మోడల్ నంబర్‌లతో కూడిన గెలాక్సీ వాచీలు WiFi కనెక్టివిటీకి మద్దతు ఇస్తాయి మరియు 40mm మరియు 44mm వ్యాసాలను కలిగి ఉండవచ్చు. SM-L305 మరియు SM-L315 SM-L300 మరియు SM-L310 యొక్క LTE కనెక్టివిటీ వేరియంట్‌లు ఉండవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy Ring India Price Leaked, Expected To Launch On July 10. Specifications Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X