దిగ్గజాలను వణికించేలా శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేస్తోంది

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స​ దిగ్గజం శాంసంగ్‌ 5జీ ఫోన్‌ను వచ్చే నెలలోనే లాంచ్‌ చేయనుందని స్థానిక మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. మార్కెట్లో ఆపిల్‌పై పైచేయి సాధించేందుకు శాంసంగ్‌ ‘గెలాక్సీ ఎస్‌ 10’

|

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స​ దిగ్గజం శాంసంగ్‌ 5జీ ఫోన్‌ను వచ్చే నెలలోనే లాంచ్‌ చేయనుందని స్థానిక మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. మార్కెట్లో ఆపిల్‌పై పైచేయి సాధించేందుకు శాంసంగ్‌ 'గెలాక్సీ ఎస్‌ 10’ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను సౌత్‌ కొరియాలో లాంచ్‌ చేయనుంది. ప్రపంచంలోనే తొలి 5జీ మొబైల్‌గా వస్తున్న ఈ ఫోన్ ను ఏప్రిల్‌ 5న ఆవిష్కరించనుంది. దీనికి సంబంధించి సిగ్నల్‌ వెరిఫికేషన్‌ పరీక్షలో శాంసంగ్ గ్రీన్‌ సిగ్నల్‌ కూడా సాధించింది.

దిగ్గజాలను వణికించేలా శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేస్తోంది

ఆ రోజునుంచే సేల్స్‌ కూడా మొదలవుతాయని తెలుస్తోంది. అయితే ధర వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అయితే రూ.91,300గా నిర్ణయించవచ్చని సమాచారం.

శాంసంగ్‌ ఎస్‌10 5జీ

శాంసంగ్‌ ఎస్‌10 5జీ

6.70 ఇంచెస్‌ డిస్‌ప్లే , ఆండ్రాయిడ్‌ 9.0, వెనుక భాగంలో నాలుగు కెమెరాలు, ముందు భాగంలో10 ఎంపి కెమెరా, సింగిల్ సిమ్, 8జీబీ ర్యామ్‌ 256 జీబీ స్టోరేజ్‌, 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటాయని లీకయిన ఫీచర్ల ద్వారా తెలుస్తోంది. కాగా ఫీచర్లు అన్నీ గెలాక్సీ ఎస్10 ను పోలి ఉంటాయని తెలుస్తోంది

స్పెషల్ ఫీచర్స్ ఇవీ

స్పెషల్ ఫీచర్స్ ఇవీ

5జీ టెక్సాలజీ సపోర్ట్. ప్రపంచంలోనే తొలి 5జీ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్10.

ఎస్10, ఎస్10+ ఫోన్లలో క్వాల్ కం స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ ను వాడుతోంది. ఇండియాలో విడుదలయ్యే ఫోన్లలో మాత్రం ఎక్సినోస్ 9820 చిప్ సెట్ తో వస్తాయి. వీటిలో 8కే వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది.

బ్యాటరీ ఒక్కసారిగా భారీగా పెంచేసింది శాంసంగ్. ఎస్9, ఎస్9+ మోడల్స్ లో 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. ఈ సారి ఏకంగా 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

 

ఫోల్డబుల్ ఫోన్
 

ఫోల్డబుల్ ఫోన్

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ పేరుతో ఫోల్డబుల్ ఫోన్ ను ఎండబ్ల్యూసీ 2019లోనే రిలీజ్ చేయబోతోంది శాంసంగ్. దీని రిలీజ్ విషయం గత నవంబరులోనే ప్రకటించింది. ఇప్పడు మార్కెట్ లోకి తెస్తోంది.

గతంలో వచ్చిన ఫోల్డబుల్ ఫోన్లకు భిన్నంగా ఇది పుస్తకంలా తెరుచుకుంటుంది.

7.3 అంగుళాల భారీ డిస్ ప్లే ఈ ఫోన్ స్పెషాలిటీ.

10 లక్షల ఫోన్లు ఒకే సారి మార్కెట్లోకి తేవాలని శాంసంగ్ భావిస్తోంది.

 

శాంసంగ్ గెలాక్సీ ఎస్10, ఎస్10 ప్ల‌స్ ఫీచ‌ర్లు

శాంసంగ్ గెలాక్సీ ఎస్10, ఎస్10 ప్ల‌స్ ఫీచ‌ర్లు

ఎస్‌10- 6.1 ఇంచ్ డిస్‌ప్లే , ఎస్‌10 ప్ల‌స్ - 6.4 ఇంచ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌/శాంసంగ్ ఎగ్జినోస్ 9820 ప్రాసెస‌ర్‌

ఎస్10 - 8 జీబీ ర్యామ్‌, 128/512 జీబీ స్టోరేజ్, ఎస్10 ప్ల‌స్ - 8/12 జీబీ ర్యామ్‌, 128/512 జీబీ/1 టీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, సింగిల్‌, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ , 12, 12, 16 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు

ఎస్10 - 10 మెగాపిక్స‌ల్ సెల్పీ కెమెరా ,ఎస్10 ప్ల‌స్ - 10, 8 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ సెల్ఫీ కెమెరాలు ఐపీ 68 వాటర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డాల్బీ అట్మోస్‌, అల్ట్రాసోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ,బారో మీట‌ర్, కెపాసిటివ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, జియో మాగ్నెటిక్ సెన్సార్‌, హాల్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్ , డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏఎక్స్‌, బ్లూటూత్ 5.0 ,యూఎస్‌బీ 3.1, ఎన్ఎఫ్‌సీ, ఎంఎస్టీ

ఎస్‌10 - 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లైస్ చార్జింగ్ , ఎస్‌10 ప్ల‌స్ - 4100 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌, వైర్‌లెస్ ప‌వ‌ర్‌షేర్

 

Best Mobiles in India

English summary
Samsung Galaxy S10 5G to be released on April 5

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X