Home
News

Galaxy S10+ స్మార్ట్‌ఫోన్‌ మీద Rs.12000 భారీ డిస్కౌంట్ ఆఫర్‌!!! ఈ రోజు మాత్రమే త్వరపడండి... 

శామ్‌సంగ్ ప్రీమియం గెలాక్సీ ఎస్ 10 + స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని ఎవరైనా చూస్తున్నారా?? అయితే దీని కంటే మంచి సమయం మరొకటి ఉండదు. ఎందుకంటే అమెజాన్‌లో పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో గల డిస్కౌంట్ ఆఫర్‌ను సంస్థ అందిస్తున్నది. ఈ ఫోన్ యొక్క అసలు ధర రూ.65,200 అయితే ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్ కింద దాదాపుగా రూ.12,000 ధర తగ్గింపుతో కేవలం రూ.52,999 తక్కువ ధర వద్ద కొనుగోలు చేసే గొప్ప అవకాశాన్ని అందిస్తున్నది. దీనితో పాటుగా కస్టమర్లకు గెలాక్సీ S10 + కొనుగోలు మీద అదనంగా రూ.2,495 నుండి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMI మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తున్నది. ఈ డిస్కౌంట్ ఆఫర్ ఆన్‌లైన్‌లో అమెజాన్ ఇండియాలో సెప్టెంబర్ 10 అర్ధరాత్రి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గెలాక్సీ ఎస్ 10 + ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9820 ప్రాసెసర్‌

గెలాక్సీ ఎస్ 10 + ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9820 ప్రాసెసర్‌

గెలాక్సీ ఎస్ 10 + స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉంది. ఇది 6.4-అంగుళాల క్వాడ్ హెచ్‌డి + కర్వ్డ్ డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లేను 3040 × 1440 పిక్సెల్ పరిమాణంలో కలిగి ఉంటుంది. దీని యొక్క డిస్‌ప్లే HDR10 + మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ శామ్‌సంగ్ ఎక్సినోస్ 9820 ప్రాసెసర్‌తో రన్ అవుతూ 8GB / 12GB RAM మరియు 128GB / 512GB / 1TB స్టోరేజ్ తో జతచేయబడి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9.0 పై మరియు సామ్‌సంగ్ స్కిన్ తో రన్ అవుతుంది.

గెలాక్సీ ఎస్ 10 + కెమెరా సెటప్

గెలాక్సీ ఎస్ 10 + కెమెరా సెటప్

గెలాక్సీ ఎస్ 10 + స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే దీని వెనుక భాగంలో డ్యూయల్ పిక్సెల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా మరియు 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ టెలిఫోటో లెన్స్ కెమెరాలు కలిగి ఉన్నాయి. ఇవి 10X డిజిటల్ జూమ్ మరియు 0.5X / 2X ఆప్టికల్ జూమ్ ను కలిగి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో కూడా డ్యూయల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఇందులో ఎఫ్ / 1.9 ఎపర్చర్‌తో 10 మెగాపిక్సెల్ కెమెరా మరియు 8 మెగాపిక్సెల్ సెకండరీ డెప్త్ సెన్సార్ కెమెరాలను కలిగి ఉన్నాయి.

గెలాక్సీ ఎస్ 10 + ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్

గెలాక్సీ ఎస్ 10 + ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్

గెలాక్సీ ఎస్ 10 + హ్యాండ్‌సెట్‌ యొక్క కనెక్టివిటీ విషయానికి వస్తే 4G సిమ్ స్లాట్ కలిగి ఉంటుంది. అలాగే ఇది IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ 4G VoLTE, VHT80 4 × 4 MIMO, Wi-Fi 802.11ax (2.4 / 5GHz) మరియు బ్లూటూత్ 5 ఫీచర్లను కలిగి ఉన్నాయి. అలాగే ఇది 4100 mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది వైర్‌లెస్ పవర్‌షేర్‌కు మద్దతుతో పాటు వైర్డు మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ రెండింటి వేగవంతమైన ఛార్జింగ్ మద్దతుతో వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S10 + gets Huge Discount Offer at Rs. 12,000: Check other Details Here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X