8K వీడియో రికార్డింగ్,5G ఫీచర్లతో శామ్‌సంగ్ గెలాక్సీ S11

|

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ ప్రతి సంవత్సరం కొత్త రకం స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తోంది. అలాగే తన నుండి రాబోయే కొత్త ఫోన్ల గురించి ఏదైనా సమాచారం ముందుగానే విడుదల చేసి దాని మీద అంచనాలను అమాంతం పెంచుతుంది. అలాగే ఇప్పుడు కూడా తన రాబోయే స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S11ను 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తోంది.

శామ్‌సంగ్

గతంలో శామ్‌సంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ప్రకటించినప్పుడు కూడా ఇలాంటి క్యూరియాసిటిని పెంచింది. ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్ రిలీజ్ అయినప్పటి నుండి వాటి యొక్క సేల్స్ బాగా ఊపు మీద ఉన్నాయి. కొత్త ఫోన్ గెలాక్సీ S11మీద కూడా ఇప్పుడు అటువంటి క్యూరియాసిటి పెరిగింది. ప్రత్యర్థులు 108MP కెమెరా గల ఫోన్లను రిలీజ్ చేస్తు ఉంటె శామ్‌సంగ్ మాత్రం దానితో పాటుగా 8K వీడియో రికార్డింగ్ ను సపోర్ట్‌ చేసే కెమెరా గల ఫోన్ ను విడుదల చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. దాని గురించి కాస్త సమాచారం కూడా లీక్ చేసింది.

 

షియోమి నుండి 5G కనెక్టివిటీ స్మార్ట్‌ఫోన్‌... రిలీజ్ ఎప్పుడు?షియోమి నుండి 5G కనెక్టివిటీ స్మార్ట్‌ఫోన్‌... రిలీజ్ ఎప్పుడు?

APK ఫైల్

శామ్సంగ్ కెమెరా యాప్ కోసం APK ఫైల్ (ఆండ్రాయిడ్ యాప్ సాఫ్ట్‌వేర్ ఫైల్) లోని కొత్త కోడ్ గెలాక్సీ S11 లైనప్ 8K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుందని సూచిస్తున్నదని XDA డెవలపర్లు నివేదించారు.

 

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865Soc రిలీజ్ ఎప్పుడో తెలుసా?క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865Soc రిలీజ్ ఎప్పుడో తెలుసా?

లీకైన కెమెరా వివరాలు

లీకైన కెమెరా వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ S11 యొక్క వేరియంట్‌లకు శక్తినిచ్చే ఎక్సినోస్ 990 చిప్‌సెట్ 8K @ 30fps వీడియో డీకోడింగ్ / ఎన్‌కోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది. అదనంగా ఇది క్వాల్‌కామ్ నుండి రాబోయే స్నాప్‌డ్రాగన్ 865 చిప్ సెట్ ను కలిగి ఉండి శామ్‌సంగ్ గెలాక్సీ S11 వేరియంట్‌లకు శక్తినిస్తుంది. ఇందులో 8K వీడియో రికార్డింగ్‌ను అందించేంత హార్స్‌పవర్ కూడా ఉంటుందని భావిస్తున్నారు.

 

DEC 1 నుండి టారిఫ్ ధరలను పెంచుతున్న వొడాఫోన్,ఎయిర్‌టెల్DEC 1 నుండి టారిఫ్ ధరలను పెంచుతున్న వొడాఫోన్,ఎయిర్‌టెల్

ISOCELL

ఇంతకుముందు లీక్స్టర్ ఐస్ యూనివర్స్ గెలాక్సీ S11 వేరియంట్‌ 108 మెగాపిక్సెల్ ISOCELL బ్రైట్ HMX సెన్సార్‌ను ఉపయోగించదని పేర్కొంది. కానీ ఇది అప్‌గ్రేడ్ చేసిన రెండవ తరం సెన్సార్‌తో వస్తుంది అని తెలిపింది. కెమెరా మోడ్‌ల విషయానికి వస్తే ఇందులో డైరెక్టర్స్ వ్యూ మోడ్, సింగిల్ టేక్ ఫోటో మరియు నైట్ హైపర్‌లాప్స్ వంటి ఫీచర్స్ వచ్చే అవకాశం ఉంది. అన్ని కెమెరా లెన్స్‌ల నుండి ఒకేసారి రికార్డ్ చేయడానికి కూడా శామ్‌సంగ్ మిమ్మల్ని అనుమతించవచ్చు.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ సంస్థ నుండి రాబోయే గెలాక్సీ S11 స్మార్ట్‌ఫోన్ మూడు స్క్రీన్ పరిమాణాల్లో లభిస్తుంది. అందులో 6.4-ఇంచ్, 6.2-అంగుళాల పరిమాణంలో గల చిన్నవి అలాగే 6.4-అంగుళాలు మరియు 6.7-అంగుళాలు అతిపెద్దవి కూడా ఉన్నాయి. మరో మాటలో చెప్పాలంటే గెలాక్సీ S10 యొక్క 6.2-అంగుళాల లేదా 6.4-అంగుళాల అప్డేట్ డిస్ప్లే తో వస్తుంది. వీటి యొక్క పేర్లు గెలాక్సీ ఎస్ 11 ఇ, గెలాక్సీ ఎస్ 11 మరియు గెలాక్సీ ఎస్ 11 + గా ఉండవచ్చు కానీ స్పష్టమైన సమాచారం మాత్రం లేదు. గెలాక్సీ ఎస్ 11 మోడల్స్ యొక్క డిస్ప్లే పొడవైన 20: 9 కారక నిష్పత్తితో వస్తున్నట్లు పుకార్లు ఉన్నాయి.

 

మీరు ఆ వీడియోలు చూస్తున్నారా.. జాగ్రత్త హ్యాకర్లు చూస్తున్నారుమీరు ఆ వీడియోలు చూస్తున్నారా.. జాగ్రత్త హ్యాకర్లు చూస్తున్నారు

కనెక్టివిటీ

ఇవాన్ బ్లాస్ ప్రకారం ఇందులో మొత్తం ఐదు వేరియంట్లు ఉంటాయని పేర్కొంది. ఇందులో గల కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే స్మార్ట్‌ఫోన్ యొక్క రెండు వేరియంట్లలో రెండు 5G మరియు LTE స్లాట్లు ఉంటాయి. ఇటీవలి నివేదిక ప్రకారం గెలాక్సీ ఎస్ 11 ఫిబ్రవరి మూడవ వారంలో మార్కెట్ లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy S11 Might Offer New Camera Features: Find Everything Here

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X