Samsung Galaxy కొత్త ఫోన్‌లు రిలీజ్!!!మొదలైన ప్రీ- బుకింగ్స్.. త్వరపడండి...

|

ప్రముఖ దక్షిణ కొరియా సంస్థ శామ్సంగ్ ఇప్పుడు కొత్తగా ఇండియాలో గెలాక్సీ ఎస్ 20 + బిటిఎస్ ఎడిషన్‌ను పర్పుల్ షేడ్‌ కలర్ ఎంపికలో విడుదల చేసింది. దీనితో పాటుగా శామ్‌సంగ్ గెలాక్సీ బడ్స్ + బిటిఎస్ ఎడిషన్‌ను కూడా అదే కలర్ ఎంపికలో విడుదల చేసింది.

Samsung Galaxy S20+ BTS Edition, Galaxy Buds+

Samsung Galaxy S20+ BTS Edition, Galaxy Buds+

గెలాక్సీ ఎస్ 20 + మరియు గెలాక్సీ బడ్స్ + BTS ఎడిషన్‌లు అద్భుతమైన కొత్త తరం స్పెసిఫికేషన్లను కలిగి ఉన్నాయి. దక్షిణ కొరియా బ్యాండ్ కొత్త కలర్ లతో విడుదల అయిన ఉత్పత్తుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Also Read: OnePlus నుండి మూడు కొత్త టీవీలు,ధర రూ.20000 లోపే మొదలు.Also Read: OnePlus నుండి మూడు కొత్త టీవీలు,ధర రూ.20000 లోపే మొదలు.

గెలాక్సీ S20 + BTS ఎడిషన్‌ ప్రత్యేకతలు
 

గెలాక్సీ S20 + BTS ఎడిషన్‌ ప్రత్యేకతలు

శామ్సంగ్ సంస్థ తన కొత్త గెలాక్సీ S20 + BTS ఎడిషన్‌లో కొన్ని ప్రీలోడ్ చేసిన BTS థీమ్‌లను కూడా ప్రవేశపెట్టింది. అవి ఈ ఫోన్‌కు చాలా ప్రత్యేకమైనవిగా మరియు ఆకర్షణీయంగా కూడా ఉంటాయి. గెలాక్సీ S20 అల్ట్రా యొక్క క్లౌడ్ వైట్ కలర్ వేరియంట్ కోసం ఈ బ్రాండ్ ప్రీ-బుకింగ్ ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించింది.

 

Also Read:టిక్‌టాక్ పూర్తి డేటాను డౌన్‌లోడ్ చేయడం ఎలా?Also Read:టిక్‌టాక్ పూర్తి డేటాను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

శామ్‌సంగ్ గెలాక్సీ S20 + ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ S20 + ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 20 + BTS ఎడిషన్ యొక్క ధర రూ.87,999. అలాగే గెలాక్సీ బడ్స్ + BTS ఎడిషన్ ధర రూ.14,990. వీటితో పాటుగా శామ్‌సంగ్ గెలాక్సీ S20 అల్ట్రా క్లౌడ్ వైట్ వేరియంట్ రూ.97,999 ధర వద్ద లభిస్తుంది. ఈ మూడింటిని కొనుగోలు చేయడం కోసం నేటి నుండి జూలై 9 వరకు శామ్సంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ప్రీ-బుకింగ్ లను నిర్వహిస్తున్నది. ఈ ఫోన్‌లు మరియు ఇయర్‌బడ్‌లు జూలై 10 నుండి కేవలం పరిమిత స్టాక్‌లో మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.

శామ్సంగ్ గెలాక్సీ S20 + స్పెసిఫికేషన్స్, సాఫ్ట్‌వేర్

శామ్సంగ్ గెలాక్సీ S20 + స్పెసిఫికేషన్స్, సాఫ్ట్‌వేర్

శామ్సంగ్ గెలాక్సీ S20 + స్మార్ట్ ఫోన్ యొక్క 6.7-అంగుళాల డైనమిక్ అమోలెడ్ HD డిస్‌ప్లే 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి మరియు 1440 × 3200 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది. ఇది సరికొత్త ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ మరియు శామ్‌సంగ్ యొక్క సొంత ఎక్సినోస్ 990 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ S20 + కెమెరా ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ S20 + కెమెరా ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ S20 + స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ సెన్సార్ తో ప్రైమరీ కెమెరా మరియు 16 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో సెకండరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా మరియు 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు కూడా ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా f / 2.2 సెన్సార్ తో కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy S20+ BTS Edition, Galaxy Buds+ Launched in India : Price, Sales Date, Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X