Samsung Galaxy S20 + BTS ఎడిషన్ ఫోన్ మీద రూ.10,000 భారీ ధర తగ్గింపు
ప్రముఖ దక్షిణ కొరియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ ఇండియాలో జూన్ నెలలో గెలాక్సీ S20 +, గెలాక్సీ బడ్స్ + వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ BTS ఎడిషన్‌ను విడుదల చేసింది. శామ్‌సంగ్ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.87,999 ధర వద్ద విడుదల చేసింది. లాంచ్ అయిన ఐదు నెలలకే ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ధర మీద రూ.10,000 తగ్గింపును తీసుకువచ్చింది.

శామ్‌సంగ్ గెలాక్సీ S20 + BTS ఎడిషన్ తగ్గింపు ధరల వివరాలు
శామ్‌సంగ్ గెలాక్సీ S20 + BTS ఎడిషన్ మీద ధర తగ్గింపు పొందిన తరువాత ఇప్పుడు రూ.77,999 ధర వద్ద లభిస్తుంది. దీనిని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డుల మీద కొనుగోలు చేసిన వినియోగదారులకు 10% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే క్రెడిట్ కార్డ్‌లో EMI పద్దతిలో కూడా కొనుగోలు చేయడానికి అవకాశం లభిస్తుంది. శామ్సంగ్ కేర్ + యాక్సిడెంటల్ మరియు లిక్విడ్ డ్యామేజ్ పై 50% డిస్కౌంట్ ఇస్తోంది.

శామ్సంగ్ గెలాక్సీ S20 + స్పెసిఫికేషన్స్
శామ్సంగ్ గెలాక్సీ S20 + స్మార్ట్ ఫోన్ యొక్క 6.7-అంగుళాల డైనమిక్ అమోలెడ్ HD డిస్‌ప్లే 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి మరియు 1440 × 3200 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది. ఇది సరికొత్త ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు శామ్‌సంగ్ యొక్క సొంత ఎక్సినోస్ 990 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ S20 + కెమెరా ఫీచర్స్
శామ్సంగ్ గెలాక్సీ S20 + స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ సెన్సార్ తో ప్రైమరీ కెమెరా మరియు 16 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో సెకండరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా మరియు 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు కూడా ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా f / 2.2 సెన్సార్ తో కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








