Samsung Galaxy S20 ఫ్యాన్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి!!!
శామ్‌సంగ్ గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఇప్పటికే చాలాసార్లు లీక్ అయ్యాయి. కాకపోతే దీని యొక్క స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్ మరియు డిజైన్ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు పబ్లిక్‌గా విడుదల చేసారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S20 సిరీస్ యొక్క టోన్ డౌన్ వెర్షన్ గా విడుదల చేయనున్నారు. గెలాక్సీ S20 FE యొక్క స్పెక్స్ మరియు డిజైన్ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే
శామ్‌సంగ్ గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే గెలాక్సీ S20 మాదిరిగానే వెనుకవైపున కెమెరా ప్లేస్‌మెంట్‌ను కలిగి ఉంది. అయితే ఇది ఆరు విభిన్న కలర్ ఎంపికలతో రంగురంగుల స్మార్ట్‌ఫోన్ గా అందుబాటులోకి రానున్నది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన లీక్ల ఆధారంగా గెలాక్సీ S20 FE బ్లూ, గ్రీన్, పింక్, గోల్డ్, రెడ్ మరియు వైట్ కలర్ ఎంపికలలో రానున్నది.

గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్
గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ఎక్సినోస్ 990 SOC (4G) మరియు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 (5G) చిప్ సెట్ లను కలిగి ఉండి శక్తిని పొందుతూ ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 120HZ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుందని భావిస్తున్నారు.

గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్స్
గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ యొక్క ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ పంచ్-హోల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నట్లు ఆశించవచ్చు. ఈ ఫోన్లోని కెమెరా ఫీచర్లలో 3x ఆప్టికల్ జూమ్, ఓఐఎస్ మరియు 4K వీడియో రికార్డింగ్ వంటివి ఉన్నాయి. ఇంకా ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ మద్దతుతో 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే IP68 రేటింగ్ మరియు అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మద్దతును కలిగి ఉంది. ఇది ఈ నెల చివరిలో లేదా అక్టోబర్ మొదటి వారంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications