Home
News

Samsung Galaxy S20 ఫ్యాన్ ఎడిషన్‌ మీద రూ.9,000 భారీ తగ్గింపు!! త్వరపడండి..

ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ సంస్థ తన గెలాక్సీ S20 యొక్క ఫ్యాన్ ఎడిషన్‌ను గత ఏడాది అక్టోబర్‌లో 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ లో రూ.49,999 ధర వద్ద ఇండియాలో విడుదల చేసింది. అయితే సంస్థ ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ మీద సుమారు రూ.9,999 వరకు భారీ ధరను తగ్గించింది. ధర తగ్గింపు పొందిన తరువాత ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడు రూ.40,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త ధర శామ్‌సంగ్ వెబ్‌సైట్ మరియు అమెజాన్.ఇన్ రెండింటిలోనూ కనిపిస్తుంది. ఈ ఫోన్ ను క్లౌడ్ నేవీ, క్లౌడ్ వైట్, క్లౌడ్ లావెండర్, క్లౌడ్ మింట్ మరియు క్లౌడ్ రెడ్ అనే ఐదు కలర్ ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు.

గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే

గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే

శామ్‌సంగ్ గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే గెలాక్సీ S20 మాదిరిగానే వెనుకవైపున కెమెరా ప్లేస్‌మెంట్‌ను కలిగి ఉంది. అయితే ఇది ఆరు విభిన్న కలర్ ఎంపికలతో రంగురంగుల స్మార్ట్‌ఫోన్ గా అందుబాటులోకి రానున్నది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన లీక్ల ఆధారంగా గెలాక్సీ S20 FE బ్లూ, గ్రీన్, పింక్, గోల్డ్, రెడ్ మరియు వైట్ కలర్ ఎంపికలలో రానున్నది.

గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్

గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్

గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ఎక్సినోస్ 990 SOC (4G) మరియు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 (5G) చిప్ సెట్ లను కలిగి ఉండి శక్తిని పొందుతూ ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ 120HZ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుందని భావిస్తున్నారు.

గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్స్

గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్స్

గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ యొక్క ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ పంచ్-హోల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ ఉన్నట్లు ఆశించవచ్చు. ఈ ఫోన్లోని కెమెరా ఫీచర్లలో 3x ఆప్టికల్ జూమ్, ఓఐఎస్ మరియు 4K వీడియో రికార్డింగ్ వంటివి ఉన్నాయి. ఇంకా ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ మద్దతుతో 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే IP68 రేటింగ్ మరియు అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ మద్దతును కలిగి ఉంది. ఇది ఈ నెల చివరిలో లేదా అక్టోబర్ మొదటి వారంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S20 Fan Edition Smartphone Gets Price Cut Upto Rs 9,000 in India: New Price, Specs, Features and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X