Home
News

Samsung Galaxy S20 FE 5G వేరియంట్ త్వరలోనే అందుబాటులోకి రానున్నది!!

ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ సంస్థ గెలాక్సీ S20 FE యొక్క 5G వెర్షన్ను వచ్చే వారం భారత్‌లో విడుదల చేయనున్నది. సామ్‌సంగ్ గాలక్సీ S20 FE యొక్క 4G వేరియంట్‌ను గత ఏడాది ఎక్సినోస్ 990 చిప్‌సెట్‌తో భారత్‌లో విడుదల చేసింది. అయితే కంపెనీ ఇప్పుడు 5G వేరియంట్‌ను కూడా తీసుకువస్తోంది. ఇది 5G క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్ ద్వారా శక్తినిపొందుతుంది. అలాగే ఇది స్నాప్‌డ్రాగన్ 865 SoC చిప్‌సెట్ ఉంటుందని చెప్పారు. శామ్సంగ్ అనేక పాశ్చాత్య మార్కెట్లలో స్నాప్‌డ్రాగన్ 865 తో గెలాక్సీ ఎస్ 20 ఫ్యాన్ ఎడిషన్‌ను విడుదల చేసింది. గెలాక్సీ SE20 FE 4G రూ.49,999 ధర వద్ద లాంచ్ అవ్వగా ఇప్పుడు అది రూ.44,999 ధరకే అమ్ముడవుతోంది.

గెలాక్సీ S20 FE 5G వెర్షన్ ధరలు, సేల్స్ & లాంచ్ వివరాలు

గెలాక్సీ S20 FE 5G వెర్షన్ ధరలు, సేల్స్ & లాంచ్ వివరాలు

గెలాక్సీ S20 FE యొక్క 5G వెర్షన్ ఇండియాలో రూ.50 వేలు కన్నా తక్కువ ధరతో విడుదల అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇటీవల కొత్తగా విడుదలైన వన్‌ప్లస్ 9 AR కు గట్టి పోటీని అందివ్వనున్నది. అలాగే 5G వేరియంట్ ప్రారంభించిన తరువాత శామ్సంగ్ సంస్థ 4G వేరియంట్ యొక్క ధరను తగ్గించే అవకాశం ఉంది. గెలాక్సీ S20 FE 5G వేరియంట్‌ను రూ.44,999 రిటైల్ ధర వద్ద లభించే అవకాశం ఉంది. ఈ ఫోన్ మార్చి 30 న మొదటిసారి అమ్మకానికి ఉంటుందని శామ్సంగ్ మొబైల్ ఇండియా ట్విట్టర్‌లో ధృవీకరించింది.

గెలాక్సీ S20 FE 5G ఇన్ఫినిటీ డిస్‌ప్లే

గెలాక్సీ S20 FE 5G ఇన్ఫినిటీ డిస్‌ప్లే

శామ్‌సంగ్ గెలాక్సీ S20 FE 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే గెలాక్సీ S20 FE 4G మాదిరిగానే వెనుకవైపున కెమెరా ప్లేస్‌మెంట్‌ను కలిగి ఉంది. అయితే ఇది ఆరు విభిన్న కలర్ ఎంపికలతో రంగురంగుల స్మార్ట్‌ఫోన్ గా అందుబాటులోకి రానున్నది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన లీక్ల ఆధారంగా గెలాక్సీ S20 FE 5G బ్లూ, గ్రీన్, పింక్, గోల్డ్, రెడ్ మరియు వైట్ కలర్ ఎంపికలలో రానున్నది.

గెలాక్సీ S20 FE 5G స్పెసిఫికేషన్స్

గెలాక్సీ S20 FE 5G స్పెసిఫికేషన్స్

గెలాక్సీ S20 FE 5G స్మార్ట్‌ఫోన్ ఎక్సినోస్ 990 SOC (5G) చిప్ సెట్ ను కలిగి ఉండి శక్తిని పొందుతూ ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ 120HZ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుందని భావిస్తున్నారు.

గెలాక్సీ S20 FE 5G వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్స్

గెలాక్సీ S20 FE 5G వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్స్

గెలాక్సీ S20 FE 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ పంచ్-హోల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ ఉన్నట్లు ఆశించవచ్చు. ఈ ఫోన్లోని కెమెరా ఫీచర్లలో 3x ఆప్టికల్ జూమ్, ఓఐఎస్ మరియు 4K వీడియో రికార్డింగ్ వంటివి ఉన్నాయి. ఇంకా ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ మద్దతుతో 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే IP68 రేటింగ్ మరియు అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ మద్దతును కలిగి ఉంది. ఇది ఈ నెల చివరిలో లేదా అక్టోబర్ మొదటి వారంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. శామ్సంగ్ ఇప్పటికే భారతదేశంలో గెలాక్సీ S20 FE కి ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను విడుదల చేయడం ప్రారంభించింది. కాబట్టి 5G వేరియంట్ కూడా ఆండ్రాయిడ్ 11 బాక్స్‌లో రన్ చేయగలదని ఆశించవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S20 FE 5G Variant India Sales Starts on March 30
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X