Samsung Galaxy S20 5G Series, Galaxy Z Flip : మొదలైన ప్రీ-రిజిస్ట్రేషన్లు
ఈ వారం ప్రారంభంలో శాన్ ఫ్రాన్సిస్కోలో లాంచ్ చేయబడిన శామ్సంగ్ గెలాక్సీ S20 సిరీస్-- గెలాక్సీ S20, గెలాక్సీ S20 + మరియు గెలాక్సీ S20 అల్ట్రా యొక్క కొనుగోలు కోసం ఇండియాలో ప్రీ-రిజిస్ట్రేషన్లు మొదలయినాయి. వీటితో పాటుగా గెలాక్సీ జెడ్ ఫ్లిప్ యొక్క ప్రీ-రిజిస్ట్రేషన్ల కోసం కూడా శామ్సంగ్ ఇండియాలో బుక్ చేసుకోవచ్చు.

గెలాక్సీ-సిరీస్ ఫ్లాగ్‌షిప్
శామ్సంగ్ యొక్క తాజా గెలాక్సీ-సిరీస్ ఫ్లాగ్‌షిప్‌లను అధికారికంగా ప్రారంభించిన తరువాత మొదటిసారిగా వీటిని ప్రీ-రిజిస్ట్రేషన్ల ద్వారా అమ్మకానికి ఉంచింది. గెలాక్సీ S20 సిరీస్ ఫ్యామిలీతో పాటు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ కూడా యుఎస్‌లో ప్రీ-ఆర్డర్‌లలో ఉన్నాయి. ప్రస్తుత శామ్సంగ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ పాత హ్యాండ్‌సెట్‌లకు బదులుగా కొత్త శామ్‌సంగ్ ఫోన్‌లలో ట్రేడ్-ఇన్ క్రెడిట్‌ను కూడా పొందవచ్చు.

ప్రీ-రిజిస్ట్రేషన్లు
శామ్సంగ్ గెలాక్సీ S20 మోడల్స్ 4G LTE మరియు 5G కనెక్టివిటీ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే గెలాక్సీ జెడ్ ఫ్లిప్ కూడా 4G LTE ఆప్షన్ ను కలిగి ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు శామ్సంగ్ యొక్క అధికారిక ఇండియా వెబ్‌సైట్ లో మీ యొక్క పేరు, ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ మరియు పిన్ కోడ్ వివరాలను అందించడం ద్వారా శామ్సంగ్ యొక్క కొత్త ఫోన్లలో గెలాక్సీ S20, గెలాక్సీ S20 + మరియు గెలాక్సీ S20 అల్ట్రాలలోని మీకు నచ్చిన దానిని ప్రీ-రిజిస్ట్రేషన్ల ద్వారా పొందవచ్చు. గెలాక్సీ S20 సిరీస్ ఫ్యామిలీతో పాటు శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ కోసం కంపెనీ ప్రీ-రిజిస్ట్రేషన్లను తీసుకుంటోంది.

లభ్యత వివరాలు
ప్రీ-రిజిస్ట్రేషన్లు చేసుకున్న తరువాత లభ్యత విషయానికి వస్తే శామ్సంగ్ గెలాక్సీ S20 మోడల్స్ మార్చి 6 నుండి గ్లోబల్ మార్కెట్లలో విక్రయించబడనున్నాయి. అలాగే గెలాక్సీ జెడ్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 14 నుండి ఎంపిక చేసిన మార్కెట్లలో మాత్రమే పరిమిత సంఖ్యలలో లభిస్తుంది.

ధరల వివరాలు
గెలాక్సీ S20 సిరీస్ మరియు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ మోడళ్ల యొక్క ఇండియా ధరల విషయంలో శామ్సంగ్ ఇంకా పూర్తి వివరాలను ప్రకటించలేదు. ఏదేమైనా శామ్సంగ్ గెలాక్సీ S20 మోడళ్ల US ధరలు 5G మోడళ్లకు $999 (సుమారు రూ.71,300) వద్ద ప్రారంభమవుతుండగా, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ యొక్క ధర $1,380 (సుమారు రూ.98,400) గా నిర్ణయించబడింది. ఇండియా యొక్క ధరలు యుఎస్‌లో ప్రారంభమయ్యే నాటికి వాటి అనుగుణంగా ఉండే అవకాశం ఉంది.
*** గెలాక్సీ S20 సిరీస్ యొక్క స్పెసిఫికేషన్స్ కొరకు కింద వున్న లింక్ ఓపెన్ చేయండి.

శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ స్పెసిఫికేషన్స్
శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఆండ్రాయిడ్ 10 ఫ్లెక్స్ మోడ్ UIతో రన్ అవుతుంది. ఇది 6.7-అంగుళాల ఫుల్-HD AMOLED డిస్ప్లే ను 1080x2636 పిక్సెల్స్ మరియు 21.9: 9 కారక నిష్పత్తితో మరియు 425pp ఫోల్డబుల్ డైనమిక్ ప్యానెల్ తో వస్తుంది. 1.1-అంగుళాల సూపర్ అమోలెడ్ కవర్ డిస్ప్లే కూడా ఉంటుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ SoC చేత రన్ అవుతు 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి ఉంటుంది. ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీనిలో వైడ్ యాంగిల్ లెన్స్‌తో 12 మెగాపిక్సెల్ సెన్సార్ మరియు అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో 12 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. అంతేకాక ఫోన్ 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.
*** గెలాక్సీ S20 అల్ట్రా 5G యొక్క స్పెసిఫికేషన్స్ మరియు పూర్తి వివరాల కొరకు కింద వున్న లింక్ ఓపెన్ చేయండి.

కనెక్టివిటీ
ఈ సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4G LTE, వై-ఫై 802.11ac, బ్లూటూత్ V 5.0, GPS / A-GPS, NFC, మరియు యుఎస్‌బి టైప్-సితో సహా సాధారణంగా కనెక్టివిటీ ఎంపికలను కలిగి ఉంటుంది. చివరగా ఈ ఫోన్ 3,300 ఎంఏహెచ్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది.


Click it and Unblock the Notifications








