Just In
- 3 hrs ago
Croma లో ల్యాప్ టాప్ లు ,స్మార్ట్ టీవీ లు & గాడ్జెట్ లపై భారీ ఆఫర్లు
- 3 hrs ago
Qualcomm కంపెనీ కొత్తగా రెండు చిప్సెట్లను విడుదల చేసింది!! ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసా...
- 5 hrs ago
అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్స్ లో టాబ్లెట్ల కొనుగోలుపై ఊహించని తగ్గింపు ఆఫర్లు....
- 21 hrs ago
స్పామ్ కాల్లతో విసిగిపోయారా? అయితే ఇలా బ్లాక్ చేయండి...
Don't Miss
- News
రెచ్చగొడుతున్నావా? నన్ను చంపాలని కుట్ర: చంద్రబాబుపై భగ్గుమన్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
- Finance
బాదుడు కంటిన్యూస్: వాటి రేట్లల్లో భారీగా పెరుగుదల
- Movies
Sarkaru Vaari paata day 9 Collections.. మహేష్ మూవీ ఇంకా నష్టాల్లోనే.. లాభాల్లోకి రావాలంటే?
- Sports
Indian Team for SA: కవలవరపెడుతున్న గాయాల బెడద.. టీ20 సిరీస్ నుంచి మరో స్టార్ పేసర్ ఔట్!
- Lifestyle
రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65
- Automobiles
ఏప్రిల్ 2022లో టాప్ 10 స్కూటర్లు ఇవే.. హోండా యాక్టివాదే పైచేయి..
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు ఫీచర్స్ ఇవిగో...
శామ్సంగ్ కంపెనీ యొక్క అభిమానులు ఎప్పటి నుంచో ఎదుచూస్తున్న గెలాక్సీ S21 FE 5G స్మార్ట్‌ఫోన్ నేడు భారతదేశంలో ప్రారంభించబడింది. ఈ కొత్త శామ్సంగ్ ఫోన్ గత సంవత్సరం ప్రారంభించబడిన గెలాక్సీ S20 FE 5G యొక్క అప్ డేట్ వెర్షన్ గా వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 120Hz AMOLED డిస్‌ప్లే ఫీచర్లతో లభిస్తుంది. శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G యొక్క భారతీయ వేరియంట్ Exynos 2100 SoCతో రన్ అవుతూ నాలుగు విభిన్న కలర్ ఎంపికలలో లభిస్తుంది. OnePlus 9 మరియు Asus ROG ఫోన్ 5 వంటి వాటికి పోటీగా విడుదలైన ఈ శామ్సంగ్ గెలాక్సీ కొత్త ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G స్మార్ట్‌ఫోన్ ధరలు & లభ్యత వివరాలు
శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.54,999 కాగా 256GB స్టోరేజ్ ఎంపిక ధర రూ.58,999. ఈ ఫోన్ గ్రాఫైట్, లావెండర్, ఆలివ్ మరియు వైట్ కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఇది జనవరి 11 నుండి Amazon, Samsung.com మరియు ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్‌లతో పాటు ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ యొక్క లాంచ్ ఆఫర్‌లలో భాగంగా HDFC బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై రూ.5,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. క్యాష్‌బ్యాక్ తరువాత దీనిని రూ.49,999 ప్రభావవంత ధర వద్ద పొందవచ్చు. ఈ క్యాష్‌బ్యాక్ జనవరి 17 వరకు వర్తిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G స్పెసిఫికేషన్స్
Samsung Galaxy S21 FE 5G స్మార్ట్‌ఫోన్ One UI 4 మరియు ఆండ్రాయిడ్ 12లో రన్ అవుతుంది. ఇది 6.4-అంగుళాల ఫుల్-HD+ డైనమిక్ AMOLE 2X డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా రక్షించబడింది. అలాగే ఇది 5nm Exynos 2100 SoCతో పాటు 8GB LPDDR5 RAMని స్టాండర్డ్ గా అందిస్తుంది. ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో f/1.8 వైడ్ యాంగిల్ లెన్స్‌తో పాటు 12-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ తో పాటు 12-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలను క్యాప్చర్ చేయడం మరియు వీడియో చాట్‌లను ఎనేబుల్ చేయడం కోసం ముందు భాగంలో f/2.2 లెన్స్‌తో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G ఫోన్ 128GB మరియు 256GB స్టోరేజ్ ఎంపికలలో వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్, GPS/ A-GPS మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌ను పెద్ద స్క్రీన్‌కి కనెక్ట్ చేయడానికి వైర్‌లెస్ డెక్స్ సపోర్ట్ కూడా ఉంది. శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5Gతో IP68-సర్టిఫైడ్ బిల్డ్‌ను అందించింది. ఇది దుమ్ము మరియు నీటి-నిరోధకతను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 25W సూపర్-ఫాస్ట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999