Galaxy S21,S21 +,S21 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి!! ధరలు, ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి...

|

శామ్‌సంగ్ గెలాక్సీ S21 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి అనేక లీక్‌లు, పుకార్లు మరియు టీజర్‌లు విడుదల అయిన తరువాత ఇప్పుడు అధికారికంగా లాంచ్ అయ్యాయి. ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లను దక్షిణ కొరియా దిగ్గజం తన గెలాక్సీ అన్ ప్యాకెడ్ 2021 కార్యక్రమంలో విడుదల చేసింది. ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో మూడు విభిన్న మోడళ్లను విడుదల చేసింది. గత సంవత్సరం లాంచ్ అయిన గెలాక్సీ S20 సిరీస్ మాదిరిగానే గెలాక్సీ S21 సిరీస్ లలో గెలాక్సీ S21, గెలాక్సీ S21 + మరియు గెలాక్సీ S21 అల్ట్రా ఫోన్లు ఉన్నాయి. ఈ మూడు మోడళ్లు అడాప్టివ్ 120HZ రిఫ్రెష్ రేట్‌, సరికొత్త కెమెరా హౌసింగ్‌ ఫీచర్లతో విడుదల అయ్యాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ S21 సిరీస్ ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ S21 సిరీస్ ధరల వివరాలు

యుఎస్‌లో విడుదల అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క ధరల విషయానికి వస్తే శామ్‌సంగ్ గెలాక్సీ S21 యొక్క ధర $ 799 (సుమారు రూ.58,500) నుండి మొదలుకాగా, శామ్‌సంగ్ గెలాక్సీ S21 + యొక్క ధర $ 999 (సుమారు రూ. 73,100) నుండి ప్రారంభం కాగా శామ్‌సంగ్ గెలాక్సీ S21 అల్ట్రా యొక్క ప్రారంభ ధర $1,199 (సుమారు రూ.87,700) నుండి మొదలుకానుంది. జనవరి 14 నుండి ఈ ఫోన్లను ప్రీ-ఆర్డర్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు అలాగే జనవరి 29 నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నాయి. గెలాక్సీ S21 మరియు గెలాక్సీ S21+ రెండూ ఫాంటమ్ వైలెట్, సిగ్నేచర్ కలర్ ఆప్షన్‌లో లభిస్తాయి. అలాగే గెలాక్సీ S21 అల్ట్రా ఫాంటమ్ టైటానియం, ఫాంటమ్ నేవీ మరియు ఫాంటమ్ బ్రౌన్ కలర్ ఎంపికలు లభిస్తాయి.

శామ్‌సంగ్ గెలాక్సీ S21 స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ S21 స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ S21 ఫోన్ ఆండ్రాయిడ్ 11 లో వన్ UIతో రన్ అవుతుంది. ఇది 6.2-అంగుళాల ఫ్లాట్ ఫుల్-HD + డైనమిక్ అమోలేడ్ 2X ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లేను 1,080x2,400 పిక్సెల్స్ మరియు 20: 9 కారక నిష్పత్తితో 421PP పిక్సెల్ సాంద్రతతో కలిగి ఉంది. ఈ డిస్ప్లేలో హెచ్‌డిఆర్ 10 + సర్టిఫికేషన్, 120HZ రిఫ్రెష్ రేట్ వంటివి ఉన్నాయి. ఇది ఆక్టా-కోర్ ఎక్సినోస్ 2100 SoC రన్ అవుతూ 8GB LPDDR5 ర్యామ్ తో జతచేయబడి ఉంది.

శామ్‌సంగ్ గెలాక్సీ S21 64MP సెన్సార్ కెమెరా ఫీచర్స్

శామ్‌సంగ్ గెలాక్సీ S21 64MP సెన్సార్ కెమెరా ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ S21 ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 12 మెగాపిక్సెల్ మొదటి సెన్సార్ అల్ట్రా-వైడ్-యాంగిల్ ఎఫ్ / 2.2 లెన్స్‌తో 120 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూ (ఎఫ్‌ఓవి) ఉంటుంది. కెమెరా సెటప్ 12 మెగాపిక్సెల్ ప్రైమరీ డ్యూయల్ పిక్సెల్ సెన్సార్‌తో ఎఫ్ / 1.8 లెన్స్‌తో ఆటోఫోకస్ సపోర్ట్‌తో వస్తుంది. అదనంగా ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్, హైబ్రిడ్ ఆప్టిక్ 3X జూమ్ మరియు ఎఫ్ / 2.0 లెన్స్ ద్వారా 76 డిగ్రీల ఎఫ్‌ఓవి కలిగిన 64 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా ఉంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో ఫ్రంట్ ఫేసింగ్ సెన్సార్‌తో పాటు ఎఫ్ / 2.2 లెన్స్‌తో 80 డిగ్రీల ఎఫ్‌ఓవి 10 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ S21 ఫాస్ట్ ఛార్జింగ్‌ ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ S21 ఫాస్ట్ ఛార్జింగ్‌ ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ S21 ఫోన్ లో 128GB లేదా 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. కనెక్టివిటీ ఎంపికలలో 5G (NSA మరియు SA రెండూ), 4G ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బేరోమీటర్, జియోమాగ్నెటిక్ సెన్సార్, గైరోస్కోప్ మరియు సామీప్య సెన్సార్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ సరికొత్త అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడా వస్తుంది. ఇది USB PD 3.0 ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిచ్చే 4,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 10W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0 అలాగే రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కోసం వైర్‌లెస్ పవర్ షేర్ కూడా ఉంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy S21 Series Smartphones Released: India Price, Specs, Features, India Sale Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X