Samsung Galaxy S22సిరీస్ ఫోన్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి!! ధర చాలా ఎక్కువ...
శ్యామ్‌సంగ్ గెలాక్సీ S22, గెలాక్సీ S22+, మరియు గెలాక్సీ S22 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ నేడు ఇండియాలో సోషల్ మీడియా ఛానెల్‌లలో హోస్ట్ చేసిన లైవ్ స్ట్రీమ్ ద్వారా ఆన్ లైన్ పద్దతిలో లాంచ్ చేసారు. గత వారం గెలాక్సీ అన్ ప్యాకెడ్ 2022 వర్చువల్ ఈవెంట్‌లో ఆవిష్కరించబడిన గెలాక్సీ S22 సిరీస్ గత సంవత్సరంలో లాంచ్ అయిన గెలాక్సీ S21 మోడల్‌ల కంటే అప్‌గ్రేడ్‌ల జాబితాను అందిస్తుంది. గెలాక్సీ S22 అల్ట్రా ఈ శ్రేణిలో అత్యంత ప్రీమియం మోడల్‌గా ఉంది. గెలాక్సీ S సిరీస్‌లో గెలాక్సీ నోట్-వంటి అనుభవాన్ని అందించడానికి ఇంటిగ్రేటెడ్ S పెన్ మద్దతును అందిస్తుంది. గెలాక్సీ S22 సిరీస్ యొక్క భారతదేశ సంస్కరణలు క్వాల్కమ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoCతో వస్తాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

సామ్ సంగ్ గెలాక్సీ S22-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు
భారతదేశంలో సామ్ సంగ్ గెలాక్సీ S22 రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 8GB RAM + 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.72,999 కాగా 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.76,999. అయితే సామ్ సంగ్ గెలాక్సీ S22+ యొక్క 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.84,999 కాగా 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.88,999. చివరిగా వీటికి విరుద్ధంగా శ్యామ్‌సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా యొక్క 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.1,09,999 కాగా టాప్-ఆఫ్-ది-లైన్ 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.1,18,999. ప్రపంచవ్యాప్తంగా ఈ మోడల్ యొక్క 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మరియు 12GB ర్యామ్ + 1TB ఎంపికలలో లాంచ్ అయింది. ఈ రెండూ భారతదేశంలో ఇంకా ప్రారంభించబడలేదు.

శ్యామ్‌సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా స్పెసిఫికేషన్స్
శ్యామ్‌సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 పై వన్ UI 4.1తో రన్ అవుతుంది. ఇది 6.8-అంగుళాల ఎడ్జ్ QHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది డైనమిక్ రిఫ్రెష్ రేట్ 1-120Hz మరియు గేమ్ మోడ్‌లో 240Hz టచ్ శాంప్లింగ్ రేటును కలిగి ఉంది. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoCతో పాటు 12GB వరకు RAMతో పనిచేస్తుంది. ఇది వెనుక భాగంలో అల్ట్రా క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్‌తో పాటు f/1.8 లెన్స్‌తో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరాను కలిగి ఉంటుంది. కెమెరా సెటప్‌లో 3x ఆప్టికల్ జూమ్‌తో 10-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ మరియు 10x ఆప్టికల్ జూమ్ మద్దతుతో మరో 10-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌లను ఎనేబుల్ చేయడం కోసం ముందు భాగంలో f/2.2 లెన్స్‌తో 40-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

సామ్ సంగ్ గెలాక్సీ S22 స్పెసిఫికేషన్స్
సామ్ సంగ్ గెలాక్సీ S22 ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 12 పై One UI 4.1తో రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో 6.1-అంగుళాల ఫుల్-HD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే బ్లూ లైట్ నియంత్రణ కోసం సామ్ సంగ్ యొక్క ఐ కంఫర్ట్ షీల్డ్‌తో వస్తుంది మరియు 10Hz వరకు తగ్గే అడాప్టివ్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. హుడ్ కింద 8GB RAMతో జత చేయబడిన ఆక్టా-కోర్ 4nm SoCని కలిగి ఉంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.8 అపెర్చర్ లెన్స్ మరియు ఆటో ఫోకస్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ డ్యూయల్ పిక్సెల్ వైడ్-యాంగిల్ సెన్సార్ ఉంటుంది. f/2.2 ఎపర్చరు లెన్స్ మరియు 120-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా మరియు 3x ఆప్టికల్ జూమ్ మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఫీచర్‌తో f/2.4 ఎపర్చరు లెన్స్‌తో 10-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం f/2.2 ఎపర్చరు లెన్స్ మరియు 80-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో 10-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

సామ్ సంగ్ గెలాక్సీ S22+ స్పెసిఫికేషన్స్
సామ్ సంగ్ గెలాక్సీ S22+ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది One UI 4.1తో ఆండ్రాయిడ్12లో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ లైట్ కంట్రోల్ కోసం శామ్‌సంగ్ ఐ కంఫర్ట్ షీల్డ్‌కు మద్దతుతో 6.6-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు 10Hzకి తగ్గే అడాప్టివ్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను మరియు 1,750 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. హుడ్ కింద గరిష్టంగా 12GB RAMతో జత చేయబడిన ఆక్టా-కోర్ 4nm SoCని కలిగి ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అమర్చబడి ఉంది. ఇందులో f/2.2 ఎపర్చరు లెన్స్ మరియు 120-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. హ్యాండ్‌సెట్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ డ్యూయల్ పిక్సెల్ ఆటోఫోకస్ వైడ్-యాంగిల్ సెన్సార్‌ను f/1.8 అపెర్చర్ లెన్స్‌తో కలిగి ఉంది; మరియు 3x ఆప్టికల్ జూమ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు f/2.4 అపెర్చర్ లెన్స్‌తో కూడిన 10-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా. Samsung Galaxy S22 10-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను f/2.2 ఎపర్చరు లెన్స్ మరియు 80-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో కలిగి ఉంది.

సామ్ సంగ్ గెలాక్సీ S22+ 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ను అందిస్తుంది. అయితే హ్యాండ్‌సెట్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బేరోమీటర్, జియోమాగ్నెటిక్, గైరో స్కోప్, హాల్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. హ్యాండ్‌సెట్‌లో అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. Samsung Galaxy S22 45W వద్ద ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4,500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, అయితే స్మార్ట్‌ఫోన్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కోసం 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ పవర్‌షేర్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఫోన్ 157.4x75.8x7.6mm కొలతలు మరియు 196 గ్రాముల బరువు ఉంటుంది.


Click it and Unblock the Notifications