Samsung Galaxy S23 FE ఫోన్ వివరాలు లీక్.. నాలుగు కలర్ వేరియంట్లు, ట్రిపుల్ కెమెరా సహా..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy S23 FE 5G విడుదల తేదీపై పూర్తి స్పష్టత రాలేదు. అయితే ఈ ఫోన్ గురించి ఇప్పటికే చాలా వివరాలు లీక్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, డిజైన్ సహా ఇతర వివరాలపై వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ఫోన్ కలర్ ఆప్షన్లు లీక్ అయ్యాయి.
శాంసంగ్ గెలాక్సీ S23 FE 5G స్మార్ట్‌ఫోన్ నాలుగు రంగుల్లో లభించనుందని తెలుస్తోంది. తెలుపు, నలుపు, ఉదా, ఆలివ్ రంగుల్లో లభించనుందని తెలుస్తోంది. గెలాక్సీ S23 FE ఫోన్.. గెలాక్సీ A54 స్మార్ట్‌ఫోన్ నుంచి ప్రేరణ పొందినట్లు ఉంటుంది. అయితే మోటాలిక్ ఎడ్జ్‌లు కలిగి ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ S23 FE 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ప్లాష్ లైట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ముందువైపు సెంటర్ పంచ్ హోల్ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని సమాచారం. అయితే ఈ ఫోన్ ఎప్పుడు విడుదల కానుందనే సమాచారం మాత్రం వెల్లడి కాలేదు.
కొన్ని నివేదికల ప్రకారం శాంసంగ్ గెలాక్సీ S23 FE 5G స్మార్ట్‌ఫోన్ 120 Hz రీప్రెష్ రేట్‌తో 6.3 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 8.2mm మందంతో ఈ ఫోన్ 210 గ్రాముల బరువు ఉంటుందని తెలుస్తోంది. మరియు ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ ఫీచర్‌ను కలిగి ఉంటుందని సమాచారం.
ఈ ఫోన్ 2.99 GHz స్పీడ్ ఆక్టా కోర్ CPUను కలిగి ఉంటుందని సమాచారం. దీంతోపాటు శాంసంగ్ కొత్త ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్UI పై రన్ కానుంది. దీంతోపాటు ఈ ఫోన్ 4,370mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 50MP+12MP+8MP వెనుక కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అలాగే ముందువైపు 10MP కెమెరా ఉండవచ్చు.
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం శాంసంగ్ గెలాక్సీ S23 FE స్మార్ట్‌ఫోన్ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ రూ.54,999గా ఉంటుందని తెలుస్తోంది. మరియు 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ రూ.59,999గా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫీచర్లలో కొన్నింటిని శాంసంగ్ నిర్ధారించింది. మరికొన్నింటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ S23 FE 5G స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీపై సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు. దీంతోపాటు ఛార్జింగ్ సామర్థ్యం, ఇతర వివరాలు వెల్లడి కాలేదు. అయితే డిజైన్ ఆకట్టుకొనే అవకాశం ఉంది. దీంతోపాటు ర్యామ్ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. విడుదల తేదీ ప్రకటన తర్వాత అన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications