Home
News

Samsung Galaxy S23 యొక్క ఫ్యాన్ ఎడిషన్ రానుంది! టీజర్ విడుదలైంది

By Maheswara

గత కొన్ని నెలలు గా కొనసాగుతున్న ఊహాగానాలుకు శాంసంగ్ ఎట్టకేలకు తన గెలాక్సీ S FE సిరీస్‌లో కొత్త మోడల్‌ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ లో Samsung Galaxy S23 FE ని త్వరలో భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు విస్తృతంగా పుకార్లు ఉన్నాయి.

దీనికి మద్దతుగా, ఈ ఫోన్ యొక్క సపోర్ట్ పేజీని శాంసంగ్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో గుర్తించబడింది. ఇప్పుడు, ఈ శాంసంగ్ 5G ఫోన్ యొక్క టీజర్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో కనిపించింది. దీనిని మొదట టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ గుర్తించారు.

Samsung Galaxy S23 FE Expected To Launch In India Soon, Teaser Released On Flipkart. Details Here.

ఫ్లిప్కార్ట్ లో ఉన్న టీజర్‌లో త్వరలో విడుదల కానున్న శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ పేరును పేర్కొనలేదు. కానీ దాని డిజైన్ ద్వారా మనకు తెలుస్తుంది.ఈ గెలాక్సీ S23 FE ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించబడిన ఫ్లాగ్‌షిప్ Samsung Galaxy S23 స్మార్ట్‌ఫోన్ యొక్క టోన్-డౌన్ వెర్షన్ కావచ్చు. ఇది ప్రీమియం S23 సిరీస్ వలె అదే డిజైన్‌ను కలిగి ఉంటుందని అంచనా వేయబడింది మరియు ఇది టీజర్‌లో కూడా ఇదే డిజైన్ ను చూడవచ్చు.

ఈ టీజర్ గెలాక్సీ S23 FE పరికరం కోసం అని టిప్‌స్టర్ కూడా క్లెయిమ్ చేస్తున్నాడు. అదే సామ్‌సంగ్ ఫోన్ కాదా.. అనే వివరాలు త్వరలో వెల్లడిస్తానని టీజర్ చెబుతోంది కాబట్టి రాబోయే రోజుల్లో లేదా వారాల్లో దీని గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, స్పెసిఫికేషన్లు మరియు ధర పరంగా ఏమి ఆశించాలో లీక్‌లు ఇప్పటికే వెల్లడించాయి.

ఇప్పటి వరకు వెలువడిన లీక్ ల ద్వారా అందిన స్పెసిఫికేషన్ల వివరాలు
శాంసంగ్ గెలాక్సీ S23 FE స్మార్ట్ ఫోన్ 6.3 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేతో వస్తుందని రిపోర్టులు చెప్తున్నాయి. ఈ స్క్రీన్ సాధారణంగా 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతునిస్తుంది. ఇది గతంలో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను అందించిన స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 లేదా Exynos 2200 చిప్‌సెట్ ద్వారా అందించబడుతుందని సూచించబడింది.

ఇది 8GB RAM మరియు 256GB స్టోరేజీ తో రావొచ్చు. ఈ ప్రీమియం 5G ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంటుందని మీరు ఆశించవచ్చు. 4,370mAh బ్యాటరీని చూడవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గురించిన వివరాలు ప్రస్తుతం తెలియవు. ఇంకా, శామ్‌సంగ్ రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ ను అందిస్తుందని అంచనా వేయలేము. ఎందుకంటే, కంపెనీ ఇప్పటికే చాలా ఫోన్‌లతో ఛార్జర్‌ను అందించడం ఆపివేసింది.

ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, ఈ ఫోన్లో మనం ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ని చూడవచ్చు. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ కెమెరా మరియు 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో, శాంసంగ్ సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం 10 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది.

త్వరలో రాబోయే, ఈ శాంసంగ్ గెలాక్సీ S23 FE ఫోన్ 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ. 54,999 ధరలో ఉంటుందని టిప్‌స్టర్ అంచనాలు తెలియచేస్తున్నాయి. అలాగే, 256GB మోడల్‌ను రూ. 59,999 ధర ట్యాగ్‌తో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. సంస్థ, Samsung Galaxy S22 FE ను లాంచ్‌ చేయలేదు. అయితే Galaxy S21 FE మోడల్ ఇదే ధర పరిధిలో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇవి అంచనాలు మాత్రమే, రాబోయే Samsung ఫోన్ యొక్క అధికారిక ధర మరియు స్పెసిఫికేషన్ల కోసం గిజబోట్ తెలుగు ని అనుసరించండి.

Best Mobiles in India

English summary
Samsung Galaxy S23 FE Expected To Launch In India Soon, Teaser Released On Flipkart. Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X