Home
News

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 తగ్గింపు.. బ్యాంకు కార్డులతో రూ.1500 అదనపు డిస్కౌంట్‌..!

శాంసంగ్‌ గత సంవత్సరం అక్టోబర్‌లో శాంసంగ్‌ గెలాక్సీ S23 FE (Samsung Galaxy S23 FE Smartphone) స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ భారీ తగ్గింపును ప్రకటన చేసింది. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు.

రూ.14,000 తగ్గింపు :
శాంసంగ్‌ గెలాక్సీ S23 FE స్మార్ట్‌ ఫోన్‌పై ఏకంగా రూ.14000 తగ్గింపును కలిగి ఉంది. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్ మింట్‌ మరియు పర్పల్‌ కలర్ 8GB ర్యామ్‌ + 128GB మోడల్‌ ధర రూ.45,999 గా ఉంది. అదే గ్రాఫైట్‌ కలర్‌ వేరియంట్ ధర రూ.51,000గా ఉంది.

Samsung Galaxy S23 FE Smartphone received Price Cut

ఈ స్మార్ట్‌ ఫోన్‌ గ్రాఫైట్‌, పర్పల్‌ కలర్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.57,900 గా ఉంది. అదే మింట్‌ వేరియంట్ ధర రూ.56,500 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌ ద్వారా తగ్గింపు ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1500 అదనపు తగ్గింపు : దీంతోపాటు ఎంపిక చేసిన క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు నోకాస్ట్‌ EMI ప్రయోజనాలను పొందవచ్చు. దీంతోపాటు ఎక్స్చేంజీ ఆఫర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. గరిష్ఠంగా రూ.27,050 వరకు ఎక్స్చేంజీ ప్రయోజనాలను పొందవచ్చు.

Samsung Galaxy S23 FE Smartphone received Price Cut

శాంసంగ్‌ గెలాక్సీ S23 FE స్మార్ట్‌ ఫోన్‌ 6.4 అంగుళాల డైనమిక్‌ అమోలెడ్‌ 2X పుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వచ్చింది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత OneUI కస్టమ్‌ OSను కలిగి ఉంటుంంది. అండర్ ది హుడ్‌ ఈ హ్యాండ్‌సెట్‌ 4nm Exynos 2200 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. నాలుగు OS అప్‌గ్రేడ్‌లు ఇస్తామని సంస్థ హామీ ఇచ్చింది.

ట్రిపుల్‌ కెమెరా యూనిట్‌, 4500mAh బ్యాటరీ : ఈ స్మార్ట్‌ఫోన్‌ 25W ఫాస్ట్‌ చార్జింగ్ సపోర్టుతో 4500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మరియు OIS సపోర్టుతో 50MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 8MP కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 10MP కెమెరాను అమర్చారు.

శాంసంగ్‌ గెలాక్సీ S23 FE స్మార్ట్‌ ఫోన్‌ కనెక్టివిటీ :
ఈ శాంసంగ్‌ గెలాక్సీ S23 FE స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ పరంగా వైఫై, బ్లూటూత్‌ 5.3, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంటుంది. మరియు ఇన్‌ స్క్రీన్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, IP68 రేటింగ్‌తో వస్తుంది. అయితే ఇది పరిమిత కాల ఆఫర్‌ లేదా శాశ్వత తగ్గింపు అనేదానిపై అమెజాన్‌, శాంసంగ్‌ స్పష్టత ఇవ్వలేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S23 FE Smartphone received price Slashed by RS14,000 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X