Home
News

భారత్‌లో తొలిసారి విడుదలైన శాంసంగ్‌ ఫోన్‌ ఇదే.. నేటి నుంచే అందుబాటులోకి..

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్‌ తన వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ సంవత్సరం తొలిభాగంలో విడుదల చేసిన S23 ఫోన్‌ను మరో వేరియంట్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ మధ్యాహ్నం 12 నుంచి అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.

స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శాంసంగ్‌ గెలాక్సీ S23 ఆల్ట్రా ఫోన్ లైమ్‌ కలర్‌ వేరియంట్‌ను ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ సంవత్సరం తొలి భాగంలో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేసిన శాంసంగ్‌ ఫాంటమ్‌ బ్లాక్‌, గ్రీన్‌, లావెండర్‌ మరియు క్రీమ్‌ రంగుల్లో మాత్రమే అందుబాటులోకి తెచ్చింది.

Samsung Galaxy S23

భారత్‌లో తొలిసారిగా శాంసంగ్ తన స్మార్ట్‌ఫోన్‌ S23ను ఫాంటమ్‌ బ్లాక్, క్రీమ్‌, పచ్చ, ఎరుపు రంగులతోపాటు గ్రాఫైట్‌, లైమ్‌ మరియు స్కై బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం అన్ని రంగుల వేరియంట్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని శాంసంగ్‌ తెలిపింది.

శాంసంగ్‌ S23 ఆల్ట్రా 6.1 అంగుళాల పుల్ హెచ్‌డీ అమోలెడ్‌ 2X డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120 Hz రీఫ్రెష్‌ రేట్‌తో రానుంది. గరిష్ట బ్రైట్‌నెస్‌ 1500ntsగా ఉండనుంది. అలాగే టచ్‌ 240 hz రేట్‌తో వస్తుంది. డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌తో వస్తుంది. దాంతోపాటు శక్తివంతమైన స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 2 CPU తో అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ OneUI 5..1 సహా ఆండ్రాయిడ్‌ 13పై ఆధారపడి పనిచేస్తుంది.

శాంసంగ్‌ గెలాక్సీ S23 ఆల్ట్రా లైమ్‌ కలర్‌ స్మార్‌ఫోన్ రెండు వేరియంట్లతో ఇవాళ్టి నుంచి అందుబాటులో ఉండనుంది. 8GB ర్యామ్, 128GB ధర రూ.74,999, మరియు 8GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ ధర 79,999 గా ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు మూడు కెమెరాలను కలిగి ఉండనుంది. 3x ఆప్టికల్‌ జూమ్ సౌకర్యంతో 50MP వైడ్‌ కెమెరా, 12MP ఆల్ట్రావైడ్‌ కెమెరా, 10MP టెలీఫోటో కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు ముందువైపు 12MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్‌ ముందు, వెనుక కెమెరాలు 60fpsలో 4k నాణ్యతతో వీడియోలు రికార్డు చేయగలవు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 3900 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తుంది. అలాగే 10W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్‌ చేస్తుంది.

శాంసంగ్‌ S23 లైమ్‌ కలర్‌ స్మార్ట్‌ఫోన్‌ ఈరోజు మధ్యాహ్నం (మే 16) 12గంటల నుంచి అన్ని ప్రముఖ ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ స్టోర్లలో అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫాంటమ్‌ బ్లాక్, క్రీమ్‌, గ్రీన్‌, రెడ్‌ రంగులతోపాటు గ్రాఫైట్‌, మరియు స్కై బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S23 lime color variant launched and available from may 16
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X