Samsung Galaxy S23 సిరీస్ ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoCలతో విడుదల కానున్నాయి...

|

స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్ లో ప్రపంచం మొత్తం మీద శామ్సంగ్ సంస్థకి మంచి పేరు ఉంది. శామ్సంగ్ సంస్థ ప్రతి సంవత్సరం శామ్సంగ్ గెలాక్సీ S-సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను స్నాప్‌డ్రాగన్ మరియు ఇన్-హౌస్ ఎక్సినోస్ ప్రాసెసర్ వంటి రెండు విభిన్న చిప్‌సెట్ వేరియంట్‌లతో విడుదల చేస్తుంది. సాధారణంగా స్నాప్‌డ్రాగన్ వేరియంట్‌లు US మరియు చైనాలో లాంచ్ చేయబడతాయి. అయితే ఎక్సినోస్ ప్రాసెసర్ ఆధారిత వేరియంట్‌లు యూరోపియన్ మరియు భారతీయ మార్కెట్‌లలో విడుదల చేయబడతాయి.

భారతీయ మార్కెట్‌

అయితే ఈ సంవత్సరం భారతీయ మార్కెట్‌లో కూడా స్నాప్‌డ్రాగన్ వేరియంట్‌ను లాంచ్ చేయనున్నది. ఈ సంవత్సరం శామ్సంగ్ సంస్థ భారతదేశంతో సహా మరిన్ని మార్కెట్‌లలో స్నాప్‌డ్రాగన్ వేరియంట్‌తో కూడిన గెలాక్సీ S-సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నిజానికి కొన్ని నివేదికల ప్రకారం శామ్సంగ్ సంస్థ ఇండియాలో ఎక్సినోస్ ప్రాసెసర్ వేరియంట్‌ను విడుదల చేయకపోవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Samsung Galaxy S23 సిరీస్ ఫోన్‌ల చిప్‌సెట్ వివరాలు

Samsung Galaxy S23 సిరీస్ ఫోన్‌ల చిప్‌సెట్ వివరాలు

శామ్‌సంగ్‌ కంపెనీ యొక్క విశ్లేషకుడు మింగ్-చి కువో తెలిపిన వివరాల ప్రకారం ఈ సంవత్సరం శామ్‌సంగ్‌కు చిప్‌సెట్ ప్రాసెసర్ సరఫరాదారుగా క్వాల్‌కామ్ సంస్థ మాత్రమే ఉంటుందని వెల్లడించారు. ఈ సంవత్సరం బహుశా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ -ఆధారిత గెలాక్సీ S23 మోడల్‌లు విడుదల అయ్యే అవకాశం ఉంటుంది అని కూడా వివరించారు. శామ్‌సంగ్‌ కంపెనీ గత సంవత్సరం స్నాప్‌డ్రాగన్-ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌లను అధికంగా విడుదల చేసింది. శామ్‌సంగ్‌ యొక్క మొత్తం షిప్ మెంట్ లో 70 శాతం వరకు ఈ మోడల్‌లను కలిగి ఉన్నాయి. ఇప్పుడు విశ్లేషకుల ప్రకారం శామ్‌సంగ్‌ గెలాక్సీ S23 కోసం Qualcomm Snapdragon ప్రాసెసర్‌ని ఎంచుకోవచ్చు.

చిప్‌సెట్

ఎక్సినోస్ 2300 SM8550 చిప్‌సెట్ మరియు స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 యొక్క పోటీలో స్నాప్‌డ్రాగన్ చిప్ మరింత మెరుగ్గా ఉంది. ఇందులో SM8550 మరింత ఆప్టిమైజ్ చేయబడి మరియు సమర్థవంతమైనది అని Kuo చెప్పారు. ఇది జరిగితే క్వాల్‌కామ్ దాని SM8550 యొక్క మార్కెట్ వాటాను 2023లో పెంచుతుంది. తద్వారా క్వాల్‌కామ్ మరియు TSMC రెండింటికీ ప్రయోజనం చేకూరుతుంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 లేదా SM8550 స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 మరియు స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 కంటే ఎక్కువ కంప్యూటింగ్ శక్తిని అందిస్తుందని విశ్లేషకులు వెల్లడించారు. మేము స్నాప్‌డ్రాగన్ 8 Gen 2ని పరిశీలిస్తున్నప్పుడు శక్తివంతమైన మరియు సమర్థవంతమైన చిప్‌ను చూస్తున్నామని పేర్కొంది.

శామ్సంగ్

శామ్సంగ్ కంపెనీ నుంచి రాబోయే శామ్సంగ్ గెలాక్సీ S23 సిరీస్ కోసం పూర్తిగా క్వాల్‌కామ్ చిప్‌లను ఉపయోగిస్తుందో లేదో ఇంకా ధృవీకరించలేదు. కానీ ఈ సంవత్సరం ప్రారంభంలో శామ్సంగ్ మొబైల్ యొక్క ప్రెసిడెంట్ TM Roh కంపెనీ గెలాక్సీ ఫోన్‌ల కోసం ప్రత్యేకమైన ప్రాసెసర్‌లను ఉపయోగించడానికి ప్రయత్నిస్తుందని ధృవీకరించారు. అయితే ఇప్పుడు గెలాక్సీ S23 ఫ్లాగ్‌షిప్‌ల కోసం ఈ ప్రాసెసర్‌లను ఉపయోగిస్తుంది అని మాకు ఖచ్చితంగా తెలియదు. ఈ వివరణ కోసం మరికొన్ని రోజులు ఆగాలి.

ISOCELL

వచ్చే ఏడాది Q1 2023లో శామ్సంగ్ గెలాక్సీ S23 సిరీస్ ప్రారంభించబడుతుంది. గెలాక్సీ S23 ఫోన్ 200MP శామ్సంగ్ HM1 ISOCELL సెన్సార్‌తో వస్తుందని కొన్ని లీక్ లు వెల్లడిస్తున్నాయి. దీనికి అదనంగా కొన్ని కాన్సెప్ట్ రెండర్‌లు Galaxy S23 అల్ట్రా ఎలా ఉంటుందో వెల్లడిస్తుంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy S23 Series Phones Comes With Snapdragon 8 Gen 2 SoC: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X