Home
News

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.10,000 ధర తగ్గింపు.. ఈ బ్యాంకు కార్డులతో మరింత డిస్కౌంట్‌..!

శాంసంగ్‌ జనవరి 17న గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శాంసంగ్‌ గెలాక్సీ S24 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఇందులో గెలాక్సీ S24, గెలాక్సీ S24 ప్లస్‌, గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఈ సందర్భంగా శాంసంగ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. శాంసంగ్‌ గెలాక్సీ S23 (Samsung Galaxy S23) స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గించింది.

శాంసంగ్‌ గెలాక్సీ S23 ను ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌ వేదికగా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై రూ.10,000 తగ్గింపు ధరను పొందవచ్చు. ఈ గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌ 128GB, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

samsung-galaxy-s23-smartphone-pricedrop

శాంసంగ్‌ గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌ ఆకర్షణీయ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 6.1 అంగుళాల డైనమిక్‌ అమోలెడ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రిప్రెష్‌ రేట్‌తో వస్తుంది. డిస్‌ప్లే రక్షణకు కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ విస్టక్‌ 2 రక్షణతో వస్తుంది.

ఈ ఫోన్ 4nm స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 2 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 8GB ర్యామ్, 512GB అంతర్గత స్టోరేజీ వరకు స్టోరేజీని కలిగి ఉంటుంది. అయితే మైక్రో SD కార్డు ఆప్షన్‌ను కలిగిలేదు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత One UI 6 పైన పనిచేస్తుంది. IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ను కలిగి ఉంటుంది.

ఈ గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌ 50MP వైడ్‌ యాంగిల్ లెన్స్‌, 3X ఆప్టికల్‌ జూమ్‌తో కూడిన 10MP టెలీఫోటో లెన్స్‌, 12MP అల్ట్రా వైడ్‌ సెన్సార్‌తో వస్తుంది. తక్కువ కాంతిలోనూ నాణ్యమైన ఫోటోలు క్యాప్టర్‌ చేసే విధంగా నైటోగ్రఫీ ఫీచర్‌ పనిచేస్తుంది. మరియు HDR10+ మరియు 8K వీడియో రికార్డింగ్‌ సపోర్టు చేస్తుంది.

అలాగే ఈ ఫోన్‌ ముందువైపు 12MP డ్యూయల్‌ పిక్సల్ కెమెరాను కలిగి ఉంటుంది. దీని ద్వారా 4k వీడియోలను క్యాప్చర్‌ చేయవచ్చు. మరియు HDR10+ ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ ఫాంటమ్‌ బ్లాక్‌, క్రీమ్, గ్రీన్‌, లావెండర్‌, గ్రాఫైట్‌ మరియు లైమ్ రంగుల్లో లభిస్తుంది.

శాంసంగ్‌ గెలాక్సీ S23 ధర : శాంసంగ్‌ గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌ 3900mAh బ్యాటరీని కలిగి ఉంది. 25W వైరడ్‌ మరియు 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ మరియు 4.5W రివర్స్‌ ఛార్జింగ్ ఆప్షన్లను కలిగి ఉంది. అమెజాన్‌లో ప్రస్తుతం ఈ ఫోన్ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.64,999, అదే 256GB ధర రూ.69,999గా ఉంది.

అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా SBI క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.9250 తగ్గింపు ధరను పొందవచ్చు. అదే యాక్సిస్‌ ఇన్ఫినిట్‌ క్రెడిట్‌ కార్డు లావాదేవీలపై గరిష్ఠంగా రూ.50000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. అమెజాన్ సేల్ ఇవాళ అర్ధరాత్రితో ముగియనుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung galaxy s23 smartphone price slashed by rs 10000 in amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X