Samsung Galaxy S23 Ultra వివరాలు లీక్ ! 200MP కెమెరా & ఫీచర్లు చూడండి.

By Maheswara
|

Galaxy S20 Ultra ప్రారంభించినప్పటి నుండి Samsung తన ఫోన్‌లలో అల్ట్రా-హై-రిజల్యూషన్ కెమెరాలను ఉపయోగిస్తోంది. కంపెనీ మూడు తరాల ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో 108MP కెమెరాలను ఉపయోగించింది: Galaxy S20 Ultra, Galaxy S21 Ultra మరియు Galaxy S22 Ultra. ఇప్పుడు, కంపెనీ ఇంకా ఎక్కువ రిజల్యూషన్ సెన్సార్‌తో కొత్త మొబైల్ ఫోన్ ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

లీక్ సమాచారం ప్రకారం

లీక్‌స్టర్ ఐస్ యూనివర్స్ (@యూనివర్స్ ఐస్) సమాచారం ప్రకారం, గెలాక్సీ S23 అల్ట్రా 200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. దక్షిణ కొరియా సంస్థ ISOCELL HP2 అనే విడుదల చేయని 200MP సెన్సార్‌ని ఉపయోగిస్తోంది అని లీక్ వివరించింది. మీరు ఒకసారి గతం గుర్తుకు తెచ్చుకుంటే, Samsung యొక్క మొదటి 200MP కెమెరా సెన్సార్, ISOCELL HP1, గత సంవత్సరం లాంచ్ చేయబడింది. కొన్ని వారాల క్రితం, కంపెనీ తన రెండవ 200MP సెన్సార్, ISOCELL HP3ని కూడా ప్రకటించింది.

ISOCELL కెమెరాలు

ISOCELL కెమెరాలు

స్పష్టంగా చెప్పాలంటే, ISOCELL HP2 అనేది ISOCELL HP1 మరియు ISOCELL HP3 రెండింటి కంటే మెరుగైన పనితీరును ప్రదర్శిస్తుంది. అవును, కొన్నిసార్లు మేము కూడా Samsung కంపెనీ ఉత్పత్తులకు పేరు పెట్టే విధానాన్ని అర్థం చేసుకోలేము. ఉదాహరణకు, ISOCELL GN2 అనేది ISOCELL GN1 కంటే మెరుగైన సెన్సర్, కానీ ISOCELL GN5 ఆ రెండింటిలోనూ అంత మంచిది కాదు.

ISOCELL HP2 గురించి
 

ISOCELL HP2 గురించి

ISOCELL HP2 గురించి తెలుసుకుంటే, దాని పరిమాణం ఇంకా తెలియలేదు. అయినప్పటికీ, ఇది నిజంగా మెరుగ్గా పని చేస్తే, అది ISOCELL HP1 (1/1.22-అంగుళాల సెన్సార్) కంటే పెద్దదిగా ఉండవచ్చు లేదా మెరుగైన డీప్ ట్రెంచ్ ఐసోలేషన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. తక్కువ రిజల్యూషన్ మరియు పెద్ద పిక్సెల్‌లతో సెన్సార్‌లను ఉపయోగించడం వల్ల సైద్ధాంతికంగా మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అధిక-రిజల్యూషన్ కెమెరాలను ఉపయోగించడం సామ్‌సంగ్ వ్యూహాన్ని ప్రశ్నిస్తున్నారు.

8K వీడియోలను

8K వీడియోలను

ఈ కొత్త సెన్సార్ సహాయం తో 8K వీడియోలను సులువుగా రికార్డ్ చేయగలదు. తక్కువ దూరాల్లో కూడా ఇది సాధ్యమవుతుంది. అంతే కాకుండా, Samsung యొక్క ఈ సెన్సార్లను ప్రపంచంలోని అనేక స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఉపయోగించవచ్చని చెప్పబడింది. స్మార్ట్‌ఫోన్ కెమెరాల తయారీలో శాంసంగ్ చాలా ముందుంది.శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ సెన్సార్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్యున్ చాంగ్ ఇటీవలే శామ్సంగ్ హై-రిజల్యూషన్ ఇమేజ్ సెన్సార్‌లను తదుపరి స్థాయికి తీసుకెళ్లే అల్ట్రాఫైన్ పిక్సెల్ టెక్నాలజీలను ప్రారంభించాలని యోచిస్తోందని పేర్కొన్నారు. ISOCELL HP1 సెన్సార్ మరియు ఇప్పటికే ఉన్న లోపాలను అధిగమించే అల్ట్రాఫాస్ట్ ఆటోఫోకస్ సెన్సార్‌ని ఉపయోగించడం ద్వారా కంపెనీ తదుపరి తరం అనుభవాన్ని అందించడంలో ఆశ్చర్యం లేదు.

samsung ఇటీవలే తమ ఫోన్లలో కొత్త ఫీచర్ ను తీసుకు వచ్చింది

samsung ఇటీవలే తమ ఫోన్లలో కొత్త ఫీచర్ ను తీసుకు వచ్చింది

ఇంకా samsung ఇటీవలే తమ ఫోన్లలో కొత్త ఫీచర్ ను తీసుకు వచ్చింది. సాధారణంగా మీ స్మార్ట్ ఫోన్ ను రిపేర్ కి తీసుకెళ్లినప్పుడు, మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను కొన్ని రోజుల పాటు రిపేర్ సెంటర్‌లో ఉంచవలసి వస్తుంది. అలాంటి సమయం లో మీ డేటా గురించి మీరు ఆందోళన చెందుతుంటారు. లేదా మీ మొత్తం డేటా ను ముందుగానే డిలీట్ చేసి backup చేసుకోవడం లాంటివి చేస్తుంటారు.ఇకపై మీరు ఇలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే శాంసంగ్ కొత్త ఫీచర్ను తీసుకువచ్చింది.ఈ ఫీచర్ ద్వారా మీ డేటా భద్రంగా ఉంటుంది. కొరియన్ జగ్గర్నాట్ ఈ సమస్యకు వినూత్నమైన సమాధానంతో ముందుకు వచ్చారు. సామ్‌సంగ్ దక్షిణ కొరియాలోని తన పరికరాలకు రిపేర్ మోడ్ అనే కీలకమైన ఫీచర్‌ను జోడిస్తోందని ప్రకటించింది.

Repair Mode

Repair Mode

ఈ Repair Mode ను యాక్టివేట్ చేసినప్పుడు, రిపేర్ టెక్నీషియన్ పని చేస్తున్నప్పుడు కూడా మీ Galaxy స్మార్ట్‌ఫోన్‌లోని వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉండేలా చేస్తుంది. Samsung రిపేర్ మోడ్ వినియోగదారులు తమ ఫోన్ రిపేర్‌లో ఉన్నప్పుడు ఏ డేటాను బహిర్గతం చేయాలనుకుంటున్నారో కూడా ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. వినియోగదారులు తమ ప్రైవేట్ డేటాను రిపేర్ కోసం పంపినప్పుడు వారి స్మార్ట్‌ఫోన్‌ల నుండి లీక్ కావడం లేదా దొంగిలించబడడం గురించి ఎల్లప్పుడూ ఆందోళన చెందుతారు. కనీసం Samsung Galaxy వినియోగదారులకైనా మనశ్శాంతిని అందించడానికి ఈ మోడ్ ఇక్కడ తీసుకువచ్చారు. కాబట్టి, ఉదాహరణకు, మీరు మీ పరికరంలో ఫోటోలు మరియు వీడియోలను పరిమితిలో ఉంచాలనుకుంటే, మీరు దాన్ని రిపేర్ మోడ్‌లో చేయవచ్చు.

రిపేర్ మోడ్ ను ఎలా ఆక్టివేట్ చేయాలో చూడండి

రిపేర్ మోడ్ ను ఎలా ఆక్టివేట్ చేయాలో చూడండి

ఈ రిపేర్ మోడ్ ను ఎలా ఆక్టివేట్ చేయాలో చూడండి  Settings > Battery And Device Care మెనులో కనిపించే రిపేర్ మోడ్ యాక్టివేట్ అయిన తర్వాత, స్మార్ట్‌ఫోన్ రీబూట్ అవుతుంది. ఆ తర్వాత, ఫోటోలు, సందేశాలు, ఖాతాలు మొదలైన వాటితో సహా మీ వ్యక్తిగత డేటాను ఎవరూ యాక్సెస్ చేయలేరు మరియు డిఫాల్ట్ యాప్‌లు మాత్రమే యాక్సెస్ చేయబడతాయి. రిపేర్ మోడ్ నుండి బయటకు రావడానికి, వినియోగదారు పరికరాన్ని రీబూట్ చేయడం ద్వారా మరియు వేలిముద్ర లేదా నమూనా గుర్తింపు ద్వారా ప్రామాణీకరించడం ద్వారా ఈ మోడ్ నుండి బయటకు రావొచ్చు.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung Galaxy S23 Ultra Is Expected To Come With 200MP ISOCELL Camera. Here Are Other Details.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X