ఈ Samsung ఫోన్ పై రూ.12000 ధర తగ్గింది! ఆఫర్ ధర, సేల్ వివరాలు
Samsung Galaxy S24 భారతదేశంలో జనవరిలో లాంచ్ చేయబడింది. దీని ప్రారంభ ధర రూ. 79,999 గా ఉండేది. అయితే, ఇప్పుడు పరిమిత వ్యవధిలో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్‌లో భాగంగా ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ తగ్గింపు ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
శాంసంగ్ కస్టమర్లకు నో-కాస్ట్ EMI ఎంపికలను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ వచ్చే వారం వరకు వర్తిస్తుంది. గెలాక్సీ S24 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ మరియు దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.

భారతదేశంలో Samsung Galaxy S24 ధర వివరాలు
దక్షిణ కొరియా బ్రాండ్ Samsung తన Galaxy S24 ధరలను భారతదేశంలో రూ.12,000 వరకు తగ్గించింది. ఈ ఆఫర్ పరిమిత కాల వ్యవధిలో స్వాతంత్య్య్ర దినోత్సవ ఆఫర్‌లో భాగంగా, ఈ ఫోన్ రూ. 62,999 ధరకు బేస్ 8GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ యొక్క అసలు లాంచ్ ధర రూ. 74,999 గా ఉండేది. అదనంగా, కస్టమర్లు 24 నెలల నో-కాస్ట్ EMI ఆఫర్‌ను నెలకు రూ.5,666 పొందవచ్చు. ఇది Samsung వెబ్‌సైట్‌లోని టైమర్ ప్రకారం, పరిమిత వ్యవధి ఆఫర్ ఆగస్టు 15 వరకు అమలులో ఉంటుంది.
256GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 79,999 బదులుగా రూ. 67,999, అయితే 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 89,999 కి బదులుగా ధర రూ. 77,999 కి అందుబాటులో ఉంది.
ఇంకా, అమెజాన్ Galaxy S24 ను రూ. 56,000 ప్రారంభ ధర ట్యాగ్‌తో జాబితా చేసింది. అయితే, ఫ్లిప్‌కార్ట్ తక్కువ వేరియంట్‌ను రూ. 62,000 కు జాబితా చేసింది.
Samsung Galaxy S24 స్పెసిఫికేషన్ల వివరాలు
శాంసంగ్ గెలాక్సీ S24 స్మార్ట్‌ఫోన్ 6.2-అంగుళాల పూర్తి-HD+ డైనమిక్ అమోలెడ్ 2X స్క్రీన్‌ను 1Hz నుండి 120Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్లు మరియు విజన్ బూస్టర్ సపోర్ట్ ను కలిగి ఉంది. ఇది కొన్ని మార్కెట్లలో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 మొబైల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా శక్తిని పొందుతుంది. అయితే భారతదేశం వేరియంట్ హుడ్ కింద 8GB RAM మరియు 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ తో పాటుగా Exynos 2400 SoC ప్రాసెసర్ ని కలిగి ఉంది.
కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, గెలాక్సీ S24 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ఇందులో 50-మెగాపిక్సెల్ వైడ్ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా మరియు 10-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఇంకా,ముందు భాగంలో ఇది 12-మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్‌ను కలిగి ఉంది.
గెలాక్సీ S24 IP68 రేటెడ్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ డిజైన్ బిల్డ్‌ని కలిగి ఉంది. ఇది 25W వైర్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు వైర్‌లెస్ పవర్‌షేర్‌కు మద్దతు ఇచ్చే 4000mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది.


Click it and Unblock the Notifications








