Home
News

Samsung Galaxy S24 ultra కొత్త వేరియంట్ లాంచ్! ధర,స్పెసిఫికేషన్లు,సేల్ వివరాలు

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఇప్పుడు భారతదేశంలో కొత్త రంగుల ఎంపికలో అందుబాటులో ఉంది. టైటానియం ఫ్రేమ్ మరియు 200 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ జనవరిలో దేశంలో ఆవిష్కరించబడింది. ఇది మూడు స్టాండర్డ్ టైటానియం కలర్‌లలో మరియు మూడు ఆన్‌లైన్- కొనుగోలుదారులకు మాత్రమే ప్రత్యేకమైన రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంది. ఈ గెలాక్సీ S24 అల్ట్రా లో శాంసంగ్ యొక్క టాప్-ఆఫ్-ది-లైన్ ఫీచర్‌లు మరియు స్పెసిఫికేషన్‌లు ఉన్నాయి, ఇన్‌పుట్‌ల కోసం S పెన్ స్టైలస్, గెలాక్సీ AI ఫీచర్లు, డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లే మరియు స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 SoC ఉన్నాయి.

భారతదేశంలో Samsung Galaxy S24 Ultra ధర వివరాలు
దక్షిణ కొరియా టెక్ బ్రాండ్ శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ని టైటానియం ఎల్లో కలర్ ఆప్షన్‌లో శుక్రవారం X ద్వారా ప్రకటించింది. ఈ కొత్త వేరియంట్ ధర బేస్ 12GB + 256GB స్టోరేజ్ మోడల్ కోసం రూ.1,29,999. అలాగే, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,39,999 మరియు 1TB స్టోరేజ్ మోడల్ ధర రూ. 1,59,999 గా ఉంది.

Samsung Galaxy s24 ultra New colour Variant Launched In India

గెలాక్సీ S24 అల్ట్రా ఇప్పటికే టైటానియం బ్లాక్, టైటానియం గ్రే మరియు టైటానియం వైలెట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. టైటానియం బ్లూ, టైటానియం గ్రీన్ మరియు టైటానియం ఆరెంజ్ షేడ్స్‌లో శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా దీనిని ప్రత్యేకంగా కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy S24 అల్ట్రా స్పెసిఫికేషన్ల వివరాలు
ఈ కొత్త షేడ్ కాకుండా, Galaxy S24 అల్ట్రా టైటానియం ఎల్లో వేరియంట్ ఇతర రంగు ఎంపికల మాదిరిగానే లుక్ మరియు స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. ఇది One UI 6.1తో ఆండ్రాయిడ్ 14 తో పనిచేస్తుంది. మరియు గెలాక్సీ AI ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది 6.8-అంగుళాల QHD+ డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేను 1Hz-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు 2,600నిట్స్ గరిష్ట ప్రకాశంతో కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ టైటానియం ఛాసిస్‌ను కలిగి ఉంది మరియు గెలాక్సీ కోసం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లో పనిచేస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా లో 200-మెగాపిక్సెల్ వైడ్ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ మరియు 10-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ సహా క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది ముందు భాగంలో 12-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది.

ఈ శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ లో 45W వైర్డు ఛార్జింగ్ మరియు 15W ఛార్జింగ్ వేగాన్ని అందించే ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0కి మద్దతుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియా ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy s24 ultra New colour Variant Launched In India. Price, specifications Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X