Home
News

Samsung Galaxy S25 Ultra వివరాలు లీక్ ! లాంచ్ ఎప్పుడంటే

శాంసంగ్ సంస్థ యొక్క తర్వాతి ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy S25 Ultra ఇప్పుడు ఒక రెగ్యులేటరీ డేటాబేస్‌లో గుర్తించబడింది. ఇది ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్ నంబర్‌ను వెల్లడిస్తుంది. కంపెనీ యొక్క తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S25 అల్ట్రా లాంచ్ కావడానికి మనము ఇంకా చాలా నెలల దూరంలో ఉన్నాము. అయితే దాని కెమెరా స్పెసిఫికేషన్‌లు మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ల గురించి ఇప్పటికే ఆన్లైన్ లో పుకార్లు వ్యాపించాయి. దీని ముందున్న గెలాక్సీ S24 అల్ట్రా జనవరిలో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 SoC ద్వారా లాంచ్ చేయబడింది. ఇది అనేక AI ఫీచర్లతో లాంచ్ చేయబడింది మరియు సానుకూల వినియోగదారుల సమీక్షలను కూడా అందుకుంది.

Samsung Galaxy S25 Ultra స్మార్ట్‌ఫోన్ IMEI డేటాబేస్‌లో గుర్తించబడింది
ఆండ్రాయిడ్ హెడ్‌లైన్‌ సమాచారం ప్రకారం గెలాక్సీ S25 అల్ట్రా IMEI డేటాబేస్‌లో మోడల్ నంబర్ SM-S938U తో గుర్తించబడింది. గెలాక్సీ సిరీస్ కోసం మునుపటి మోడల్ నంబర్‌ల ఆధారంగా, 'U' అనేది US వేరియంట్‌కి చెందిన సూచన కావచ్చు.

Samsung Galaxy S25 Ultra US Variant

ఈ అంతర్జాతీయ వేరియంట్ వేరే మోడల్ నంబర్‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ మోడల్ నంబర్‌తో పాటు, లిస్టింగ్ లో ఈ హ్యాండ్‌సెట్ గురించి ఎలాంటి స్పెసిఫికేషన్‌లను విడుదల చేయలేదు.

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా మునుపటి తరం గెలాక్సీ S సిరీస్ ఫోన్‌ల మాదిరిగానే వచ్చే ఏడాది ప్రారంభంలో అధికారికంగా లాంచ్ కానుంది. ఇది అల్ట్రావైడ్‌ కెమెరా తో కొత్త అప్‌గ్రేడ్‌ను తీసుకువస్తుందని అంచనా ఉంది మరియు టెలిఫోటో సెన్సార్‌లు గణనీయమైన మెరుగుదలను పొందుతున్నాయి.

అంచనా, ప్రకారం ఈ హ్యాండ్‌సెట్‌లో 200-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 50-మెగాపిక్సెల్ 3 టెలిఫోటో సెన్సార్‌తో కూడిన క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఆప్టికల్ జూమ్ కూడా ఉంటుంది.

ఈ ఫీచర్లను పోలిక కోసం చూస్తే, ప్రస్తుత తరం గెలాక్సీ S24 అల్ట్రా 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ మరియు 3x ఆప్టికల్ జూమ్‌తో 10-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్‌తో సమానమైన క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ఇంకా, గెలాక్సీ S25 అల్ట్రా UFS 4.1 స్టోరేజీ ఫీచర్ తో సెకనుకు 8GB డేటా బదిలీ రేట్ కలిగి ఉంటుందని చెప్పబడింది. ఇది గెలాక్సీ S24 అల్ట్రా లో అందుబాటులో ఉన్న UFS 4.0 ఫ్లాష్
స్టోరేజీపై కొంచెం అప్‌గ్రేడ్ కావచ్చు. ఇది తరువాతి తరం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 SoC పై పనిచేస్తుందని సూచించబడింది.

శాంసంగ్ యొక్క గెలాక్సీ S24 అల్ట్రా జనవరిలో లాంచ్ చేయబడిన సంగతి మీకు తెలిసిందే. దీని ప్రారంభ ధర రూ. 1,29,999 గా లాంచ్ అయింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S25 Ultra US Variant Listed On IMEI Listings. Expected Specifications Leaked Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X