సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లుకు ‘గుడ్‌ న్యూస్’

Posted By: Prashanth

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లుకు ‘గుడ్‌ న్యూస్’

 

భారీ అంచనాల మధ్య మార్కెట్లో విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 అదే రీతిలో మార్కెట్‌ను ఆకట్లుకోగలిగింది. ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రెండు నెలల వ్యవధిలోనే కోటి యూనిట్లను అధిగిమించడం ఆశ్చర్యకర అంశం. ఈ స్మార్ట్ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన అత్యాధునిక సాఫ్ట్‌వేర్ అదేవిధంగా హై‌ఎండ్ స్పెసిఫికేషన్‌లు గ్యాడ్జెట్ మన్నికను రెట్టింపు చేశాయి. గెలాక్సీ ఎస్3కి సంబంధించి పలు ఉపకరణాలను సామ్‌సంగ్ ప్రకటించినప్పటికి అవి ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. గెలాక్సీ ఎస్3 సంబంధించి ఈ సౌత్ కొరియన్ సంస్థ ప్రకటించిన ఉపకరణాల జాబితాలో ఎస్ పెబ్బిల్, ఆల్ షేర్ క్యాస్డ్ డాంగిల్, వైర్‌లెస్ చార్జింగ్ కిట్ ఉన్నాయి. గెలాక్సీ ఎస్3 విడుదలై దరిదాపు మూడు నెలలు గడస్తున్నప్పటికి ఉపకరణాలు అందుబాటులోకి రాకపోవటం పట్ల వినియోగదారులు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో ప్రముఖ టెక్ సంస్థ ‘జెన్స్’ ( Zens) గెలాక్సీ ఎస్3 యూజర్లకు మంచి వార్తను మోసుకొచ్చింది. గెలాక్సీ ఎస్3కి సరితూగే వైర్ లెస్ చార్జింగ్ కిట్ ను ఈ సంస్థ తాజాగా వృద్ధి చేసింది. బ్లూ ఇంకా వైట్ కలర్ వేరియంట్ లలో డిజైన్ కాబడిన ఈ చార్జింగ్ కిట్ ధర రూ.4,700. ఈ చార్జింగ్ కిట్ తో ఇతర డివైజ్ లను సైతం వైర్ల సాయం లేకుండా చార్జ్ చేసుకోవచ్చు. సెప్టంబర్ లో వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot