గబ్బర్‌సింగ్ రేంజ్‌లో ఫుల్‌లెంగ్త్ హిట్!!

By Super
|
Samsung Galaxy S3 smartphone creating wonders

భారీ అంచనాల మధ్య శుక్రవారం భారత్ మార్కెట్లో విడుదలైన ‘సామ్ సంగ్ గెలాక్సీ ఎస్3’ రికార్డు స్థాయిలో అమ్మకాల దిశగా దూసుకు వెళుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవాప్తంగా విడుదలకు ముందే 9 మిలియన్లు ప్రీ ఆర్డర్లు దక్కించుకున్న గెలాక్సీ ఎస్3, గబ్బర్ సింగ్ సినిమా రేంజ్ లో హిట్ టాక్ కైవసం చేసింది. ప్రధానంగా ఈ స్మార్ట్ ఫోన్ లో పొందుపరిచిన పలు ఫీచర్లు యూజర్ కు కొత్త శ్రేణి మొబైలింగ్ అనుభూతులను చేరువచేస్తాయి.

గెలాక్సీ ఎస్-3లోని ప్రత్యేక ఫీచర్లు:

స్మార్ట్ స్టే: యజమాని ముఖాన్ని, మాటలను గుర్తించి తదనుగుణంగా పనిచేయడమే ‘స్మార్ట్ స్టే’ ఫీచర్ విశిష్టత . యూజర్ ఫోన్‌ను చూస్తున్నంత సేపు స్క్రీన్ ప్రకాశవంతంగా ఉంటుంది.

ఎస్ వాయిస్: మీకు నచ్చిన పాట పేరు చెబితే చాలు దాన్ని ప్లే చేస్తుంది. వాల్యూమ్‌ను పెంచమని, తగ్గించమని చెప్పొచ్చు. కెమేరా ఆన్ చేసి ఫొటోలు తీయమనవచ్చు. మెయిల్స్, మెసేజ్‌లు పంపమనొచ్చు.

ఆల్‌షేర్ ప్లే : ఆప్షన్‌తో ఎటువంటి ఫైల్‌ను అయినా మరో గెలాక్సీ ఎస్-3కి, ట్యాబ్లెట్‌కు, పీసీకి, టీవీకీ పంపవచ్చు. వాటి మధ్య దూరంతో పనిలేదు.

డెరైక్ట్ కాల్ : మెసేజ్ టైప్ చేస్తున్న సందర్భంలో అదే నంబరు గల వ్యక్తికి ఫోన్ చెయ్యాలనిపిస్తే, జస్ట్ ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకొంటే చాలు సంబంధిత నంబర్‌కు ఫోన్ డయల్ అవుతుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 ఫీచర్లు:

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు. పెబల్ బ్లూ, మార్బుల్ వైట్ రంగుల్లో లభించే గెలాక్సీ ఎస్-3 ఫోన్ ధర రూ.43,180.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X