మెగా అభిమానులకు ‘మెగా న్యూస్’

Posted By: Staff

మెగా అభిమానులకు ‘మెగా న్యూస్’

 

మెగా బ్రాండ్ సామ్‌సంగ్ ప్రతిష్తాత్మకంగా ప్రారంభించిన గెలాక్సీ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా మిన్నంటే ఆదరణ లభిస్తోంది. ఆధునికతను క్వాలిటీని జోడించి కేకపుట్టిస్తున్న సామ్‌సంగ్ యూవత్ స్మార్ట్‌ఫోన్ పరిశ్రమను దడదడ లాడిస్తుంది. తాజాగా ప్రకటించబడిన ‘గెలాక్సీ ఎస్3’ఇప్పటికే 9 మిలియన్ల ప్రీఆర్డర్లను దక్కించుకుని రికార్డులు తిరగరాస్తుంది.

లండన్ వెలుగుజిలుగుల మధ్య అతిరథమహారధులు సమక్షంలో మే3న బ్రహ్మాండంగా ఆవిష్కరించబడిన ఈ గ్యాడ్జెట్ విక్రయాలు మే29 నుంచి యూరోప్‌లో ప్రారంభంకానున్నాయి. భారత్‌లో వీటి విక్రయాలు జాన్ మొదటి వారం నుంచి ప్రారంభమవుతాయని తొలిగా ప్రకటించినప్పటికి మే31నుంచే అందుబాటులోకి రానున్నాయని ‘స్టఫ్ ఇండియా’తన ట్వీట్‌లో పేర్కొంది.

మూడు మెమరీ వేరియంట్‌లలో లభ్యమవుతున్న ఈ స్మార్ట్ఫోన్ ఇండియన్ మార్కెట్ ధరకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం లేదు. విశ్లేషకులు మాత్రం ఈ గ్యాడ్జెట్ ధర మోడల్‌ను బట్టి రూ.38,000 నుంచి 42,500 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ధరకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని మే31న ఏర్పాటు చేసే ఆవిష్కరణ కార్యక్రమంలో సామ్‌సంగ్ ఇండియా వర్గాలు ప్రకటించనున్నాయి.

ముందస్తు బుకింగ్ ద్వారా గెలాక్సీ ఎస్3ని దక్కించుకునే అవకాశాన్ని సామ్‌సంగ్ ఇండియా కల్పిస్తుంది. ఔత్సాహికులు సామ్‌సంగ్ ఈ-స్టోర్‌లోకి లాగినై సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. యూరోప్, ఆసియా మార్కెట్ల నుంచి ఇప్పటికే 9 మిలియన్ల ముందస్తు ఆర్డర్లు దక్కించుకున్న గెలాక్సీ ఎస్3 భవిష్యత్‌లో ఏ విధమైన రికార్డులను నెలకొల్పుతుందో వేచి చూడాలి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting